ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న హీరో అంటే లిస్ట్ లో మన మాస్ మహారాజా రవితేజ పేరు ఖచ్చితంగా ఉంటుంది. రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ వరుసగా ఫ్లాపులు రవితేజతో ఆడేసుకున్నాయి. రాజా ది గ్రేట్ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు మన మాస్ రాజ. అందులో భాగంగానే వేరే డైరెక్టర్స్ చెప్పిన కథలని కూడా ఒప్పుకోకుండా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ చెప్పిన లైన్ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మన మాస్ మహారాజా. 

 

ఆయన దర్శకత్వంలో రవితేజ హీరోగా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ వంటి ముగ్గురు గ్లామర్ బ్యూటీస్ హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ సినిమా డిస్కోరాజా. ఈ సినిమాని గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుసగా మూడు ఫ్లాప్స్ తర్వాత రవితేజ ని కొత్తగా చూస్తామని థియోటర్స్ కి ఆశగా వచ్చారు ఆయన ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్. అయితే వాళ్ళ ఆశలన్ని ఆవిరి చేశాడు రవితేజ. కేవలం లైన్ మాత్రమే బాగున్నప్పటికి అసలు కథ కథనం ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్సే పెదవి విరిచారు. ఇలా కాదు మాస్ రాజాని చూడాలనుకుంది అంటూ హర్ట్ అయ్యారు. అసలు ఇలాంటి కథ ని ఎలా ఒప్పుకున్నావు రాజా అంటూ తమ హీరోని క్వశన్ చేస్తున్నారు. 

 

ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ బాగా కోపంగా ఉంది థమన్ మీదేనట. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న థమన్ డిస్కో రాజా కి ఇలాంటి మ్యూజిక్ ఇచ్చాడని బాగా ఫీలవుతున్నారట. అల కోసం మాత్రం రాత్రింబవళ్ళు కష్టపడి ఈ సినిమాకి మాత్రం టీ తాగుతు ట్యూన్స్ కట్టాడా ..అసలు మాస్ రాజా కోసం మనసు పెట్టాడా అంటు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఫ్యాన్స్ లో ఈ బర్నింగ్ కి రీజన్ కూడా ఉంది. ఇదే రవితేజ సినిమాలకి థమన్ గతంలో సూపర్బ్ ఆల్బంస్ ని ఇచ్చాడు. మంచి ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చాడు. దాంతో థమన్ మ్యూజిక్ అనగానే అందరికీ ఆడియో సూపర్ హిట్ అని ఫిక్సైయ్యారు. కానీ సీన్ రివర్స్ అయింది. దాంతో రవితేజ ఫ్యాన్స్ థమన్ ని పార్శాలిటి చూపించాడని అంటున్నారు. ఇన్‌డైరెక్టర్ గా అల సినిమా మ్యూజిక్ తో కంపేర్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: