మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా సినిమా డిస్కో రాజా, నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముదుకు వచ్చి చాలావరకు నెగటివ్ టాక్ ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా కోసం మంచి సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు విఐ ఆనంద్, దానిని ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తీయడంలో చాలావరకు విఫలం అయినట్లు తెలుస్తోంది. సినిమా బిగినింగ్ నుండి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎంతో ఆసక్తికరంగా, అలానే ఇంటర్వెల్ లో మంచి ట్విస్ట్ వరకు నడిపిన దర్శకుడు, సెకండ్ హాఫ్ ని చాలావరకు గాలికి వదిలేసినట్లు చెప్తున్నారు. ఇక చాలావరకు ఫక్తు రొటీన్ గా సాగె సెకండ్ హాఫ్ తో ప్రేక్షకుడికి సహనానికి కొంత పరీక్షను ఎదురవుతుందని, 

 

అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఒకింత బాగానే ఉందని అంటున్నారు. ఇక హీరోగా రవితేజ తన ఆకట్టుకునే ఎనర్జి లెవెల్స్ తో యాక్షన్ అదరగొట్టినప్పటికీ హీరోయిన్స్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో సినిమాలో రొమాంటిక్ సీన్స్ పెద్దగా ఆకట్టుకోవని అంటున్నారు. ఇక ఓవరాల్ గా రాబోయే రోజుల్లో ఈ సినిమా నిలబడడమే కష్టం అని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. అయితే రేపు వీకెండ్ కావడంతో రేపు, ఎల్లుండి ఈ సినిమాకు బాగానే కలెక్షన్స్ వస్తాయని, అయితే ఎల్లుండి నుండి మాత్రం సినిమా చాలా కష్టంగా ముందుకు సాగె పరిస్థితులు కనపడుతున్నట్లు వారు చెప్తున్నారు. 

 

ఇప్పటికే వరుసగా మూడు ఫ్లాప్స్ ని ఎదుర్కొని కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్లో పడ్డ రవితేజ పై వాట్ ఈజ్ దిస్ రాజా, ఇలా అయితే ఇకపై కష్టమే అంటూ కొందరు ప్రేక్షకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఇప్పటికే హీరోల మధ్య పోటీ వాతావరణం మరింతగా పెరగడంతో పాటు ఎప్పటికపుడు కొత్త సినిమాల రాక ఎక్కువ అవడం, అలానే కొత్త హీరోలు, దర్శకులు కూడా ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తున్నందున, మాస్ రాజా ఈ విధమైన విషయంలేని సినిమాలు ఎంచుకోవడం వలన ఆయన భవిష్యత్తు కొంత సమస్యల్లో పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏంటి మాస్ రాజా వింటున్నావా.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: