దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు డైరక్షన్ లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమా సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 1996 లో వచ్చిన ఈ సినిమా శ్రీకాంత్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. దీప్తీభట్నాకర్, రవళి హీరోయిన్స్ గా నటించిన ఆ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కూడా సినిమా హిట్ కు ప్రధాన కారణమైంది. మంచి కథ, కథనాలతో పాటుగా కామెడీతో రాఘవేంద్ర రావు చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అందుకే అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

 

అయితే ప్రస్తుతం కాలంలో ఆ సినిమా మళ్లీ తీస్తే ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటే అది అనీల్ రావిపుడి అంటున్నారు. పటాస్ నుండి రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు వరకు సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న అనీల్ రావిపుడి కథ ఎలా ఉన్నా తన కామెడీ టైమింగ్ తో సినిమాలను హిట్టు కొడుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ తర్వాత అనీల్ మీద నమ్మకం మరింత పెరిగింది.

 

పెళ్లిసందడి 2 తీస్తే కనుక దాన్ని అనీల్ రావిపుడి తీస్తే పక్కా హిట్టు కొడుతుందని అంటున్నారు. రాఘవేంద్ర రావుకి కూడా అనీల్ రావిపుడి డైరక్షన్ అంటే చాలా ఇష్టమని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సరిలేరు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అనీల్ రావిపుడి త్వరలో ఎఫ్-3 సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడని తెలుస్తుంది. మరి ప్రేక్షకుల కోరిక మేరకు పెళ్లిసందడి 2 అనీల్ రావిపుడి చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఎఫ్-3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా రవితేజ కూడా నటిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: