దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిభకు కొదవ లేదు. ప్రతిభ గల నటులు, అభిరుచి గల నిర్మాతలు, విజన్ ఉన్న దర్శకులు, టాలెంటెడ్ టెక్నీషియన్లు.. ఇలా ఎందరో మన దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ కి వెళ్లి దక్షిణాది సత్తా చాటిన వారూ ఉన్నారు. వారిలో తెలుగు నుంచి రామ్ గోపాల్ వర్మ, తమిళ్ నుంచి మణిరత్నం, మళయాళం నుంచి ప్రియదర్శన్ అనే చెప్పాలి. దక్షిణాదిలో వీరికున్న పేరు ప్రఖ్యాతులే తమ టాలెంట్ తో బాలీవుడ్ లోనూ అగ్ర దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీరి సరసన చేరుతున్నాడు ప్రభుదేవా.

 

 

డ్యాన్స్ డైరక్టర్ నుంచి దర్శకుడిగా మారిన ప్రభుదేవా తెలుగు, తమిళ, హిందీ బాషల్లో దర్శకుడిగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో మూడు సినిమాల ఒప్పందంలో భాగంగా ఆయనతో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే వీరి కాంబినేషన్ లో దబాంగ్3 వచ్చిన విషయం తెలిసిందే. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన పోకిరి హీందీ రీమేక్ వాంటెడ్ కు కూడా ప్రభుదేవానే దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రాధే సినిమా వస్తోంది. దీని తర్వాత ఏక్ ధా టైగర్ సిరీస్ లో మూడో సినిమా ఏక్ ధా టైగర్3ని కూడా ప్రభుదేవానే దర్శకత్వం వహిస్తాడు.

 

 

సల్మాన్ భాయ్ అంత త్వరగా నమ్మి దర్శకుడిగా అవకాశం ఇవ్వడనే వాదన ఉంది. కబీర్ ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్ వంటి దర్శకులకే ఆయన చాన్స్ ఇస్తాడు. అలాంటిది ప్రభుదేవాను నమ్మి ఇన్ని సినిమాలు వరుసగా అవకాశాలు ఇవ్వడం ప్రభుదేవాపై నమ్మకమనే చెప్పాలి. దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో పాగా వేయడం అంటే మాటలు కాదు. అక్కడ దక్షిణాది వారి సత్తా చాటి పేరు తెచ్చుకోవడం నిజంగా గ్రేట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: