మాస్ మహరాజ్ రవితేజ, డిఐ ఆనంద్ కాంబోలో సైఫై మూవీగా శుక్రవారం రిలీజైన సినిమా డిస్కో రాజా. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాం తాళ్లూరి ఈ సినిమా నిర్మించారు. సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా స్క్రీన్ ప్లే రెగ్యులర్ గా నడిపించడంతో నిన్న రిలీజైన డిస్కో రాజా జస్ట్ యావరేజ్ అన్న టాక్ తో నడుస్తుంది. ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ ఏంటంటే ఉత్తమ కుమార్ గా నటించిన కమెడియన్ సునీల్ విలన్ గా సర్ ప్రైజ్ ఇవ్వడమే.

 

డిస్కో రాజా గ్యాంగ్ లో అప్పటివరకు భయస్తుడిగా ఉండే ఉత్తమకుమార్ అదేనండి మన సునీల్ ఏకంగా డిస్కో రాజా బర్మా సేతుల మధ్యలో దూరి వారి మధ్య గొడవలు పెట్టి చివర్లో అతనే అసలు సూత్రదారిగా కనిపిస్తాడు. సునీల్ ను విలన్ గా చూపించాలని అనుకోవడంలో తప్పేమి లేదు. కాని ఇలాంటి సైన్స్ ఫిక్షన్ స్టోరీకి సునీల్ విలనిజం ఎంతవరకు యాడ్ అవుతుందని మరోసారి ఆలోచించాల్సింది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అనిపించిన డిస్కో రాజా సెకండ్ హాఫ్ మొదటి పావు గంట వరకు బాగా నడిపించగా క్లైమాక్స్ కు వస్తున్నా కొద్ది రెగ్యులర్ ఫార్మెట్ లోకి వెళ్తుంది.

 

ఇక సునీల్ విలన్ గా ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు. విఐ.ఆనంద్ ఏ ఉద్దేశంతో సునీల్ ను విలన్ గా పెట్టి సర్ ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడో కాని అది మాత్రం వర్క్ అవుట్ అవలేదని చెప్పాలి. డిస్కో రాజా సినిమా రవితేజ కెరియర్ లో మంచి హిట్ అవుతుందని అందరు ఆశించారు. కాని సినిమా ఫలితం మాత్రం తేడా కొట్టేసింది. మరి ఈ టాక్ తో సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: