త్రివిక్రమ్ శ్రీనివాస్ అది ఒక పేరు కాదు... బ్రాండ్ ఇమేజ్.  త్రివిక్రమ్ రచయితగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో, దర్శకుడిగా కూడా అంతకంటే గొప్ప పేరు తెచ్చుకున్నారు.  గొప్ప సినిమాలు చేశారు.  దానికి ఓ ఉదాహరణ అతడు సినిమా.  ఈ సినిమా తీసిన విధానం ఇప్పటి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అప్పటి నుంచి సినిమా సినిమాకు త్రివిక్రమ్ తన స్టైల్ ను పెంచుకుంటూ వెళ్లారు.  సినిమా ఎలా ఉన్నా సరే త్రివిక్రమ్ మార్క్ మాత్రం అందులో కనిపిస్తుంది.  


సినిమా హిట్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా త్రివిక్రమ్ సినిమాలను ప్రేక్షకులు లైక్ చేస్తుంటారు.  దర్శకుడు త్రివిక్రమ్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  త్రివిక్రమ్ కు సోషల్ మీడియాలో ఉన్న మంచి ఫాలోయింగ్ ఉన్నది.  అయితే, అ ఆ సినిమా సినిమా తరువాత త్రివిక్రమ్ ఓ సెంటిమెంట్ పట్టుకున్నారు.  అ సెంటిమెంట్ త్రివిక్రమ్ ను వదలడం లేదు.  


త్రివిక్రమ్ అ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సెంటిమెంట్ ను  అలా ఫాలో అవుతున్నారు.  పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేశారు.  అయితే, ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. అంతకు ముందు అత్తారింటికి దారేది తీశాడు.  అది సూపర్ హిట్ కొట్టింది.  కాగా, ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత వీర రాఘవ సినిమా కూడా హిట్ కావడంతో త్రివిక్రమ్ కు అ అనే అక్షరం కలిసి వచ్చింది.  


దానికి తగినట్టుగానే కథలు రాసుకొని,  దానికి తగిన టైటిల్స్ ను సెట్ చేసుకుంటున్నారు.  ఎన్టీఆర్ సినిమా బన్నీ తో చేసిన అల వైకుంఠపురంలో సినిమా కూడా అదే రేంజ్ హిట్ కొట్టింది.  ఈ సినిమా హిట్ కొట్టడంతో ఇప్పుడు అ సెంటిమెంట్ ను త్రివిక్రమ్ బలంగా నమ్ముతున్నారు.  భవిష్యత్తులో కూడా త్రివిక్రమ్ అదే సెంటిమెంట్ ను ఫాలో కాబోతున్నారని అంటున్నారు.  నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  ఇది జంధ్యాల తరహాలో పక్కా ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: