నీది నాది ఒకే కథ లాంటి సెన్సిటివ్ సినిమా ద్వారా మంచ్ విజయం అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తన తర్వతి సినిమాగా రానాతో విరాటపర్వం చేస్తున్నాడు. నీది నాది ఒకే కథ సినిమాలో నాన్న కొడుకుల మధ్య అనుబంధాన్ని అద్భుతంగా చూపించి మంచి మార్కులు కొట్టేసిన ఈ దర్శకుడు మరోసారి సరికొత్తగా మాయ చేయబోతున్నాడు. రానా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా కనిపిస్తుంది.

 

 

‘విరాటపర్వం’ అనే పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. అయితే పేరుకు పొలిటికల్ థ్రిల్లర్ అయినప్పటికీ ఈ సినిమాలో మాత్రం కొత్త కోణాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయట. రానా పాత్రలో నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయట. పాజిటివ్ థింకింగ్ తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని.. అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని.. మొత్తంగా మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథగా ఉంటుందట. 

 

 

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ న్యూ యాంగిల్ లో దర్శకుడు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. చెప్పుకోవడానికే కొత్తగా అనిపిస్తున్న ఈ పాత్ర సినిమాలో మరో రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలోని 1980 – 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాను దర్శకుడు రాసుకున్నాడు. అంటే అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. 

 

 

నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా కనిపిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా నటిస్తోంది. ఈ సినిమాని తెలుగు తో పాటు తమిళ మరియు హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. మరి సెన్సిటివ్ హిట్ అందించిన వేణు ఊడుగుల రానాతో చేస్తున్న విరాటపర్వం తో హిట్ కొడతాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: