రాజమౌళి బాహుబలి లాంటి సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ పేరు అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ప్రస్తుతానికి ఇదే అందరి నోళ్లలో నానింది. ఐతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మొన్నటి వరకు విశాఖ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ  చిత్రం ఇప్పుడు మరో షెడ్యూల్ తో బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కుడా చేరిపోయారు.

 

 

ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరెకెక్కిస్తున్న ఈ చిత్రానికి లీకేజీల బెడద తప్పట్లేదు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ లుక్ బయటకి రావడంతో అందరూ షాకయ్యారు. దీంతో టీమ్ షూటింగ్ లొకేషన్లో పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంది. బయటకొచ్చిన ఎన్టీఆర్ లుక్ ని ఆన్ లైన్లో నుండి తొలగించినా కూడా మళ్ళీ లీకేజీ సమస్య ఏర్పడింది. ప్రస్తుతం తాజాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ తాలూకు విజువల్ ఒకటి బయటికొచ్చింది.

 

 

ఈ ఫైట్ అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. ఈ పోరాట సన్నివేశం సినిమాలోని కీలకమైన అంశాల్లో ఒకటని సమాచారం. అలాంటి సీన్ విజువల్స్ బయటకి రావడంతో చిత్ర యూనిట్ మరింత అప్రమత్తమైంది. ఇలాంటి లీకేజీలు బయటకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారట. గతంలో బాహుబలి సినిమా విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. మరి ఇకనైనా జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు.

 

 

ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాని తెలుగుతో పాటు మరో తొమ్కిది భాషల్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషలతో పాటు మరో ఐదు భాషల్లో విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే ఆ మిగతా ఐదు భాషలేంటనేది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే డెబ్బై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జులై ౩౧ వ తేదీన రిలీజ్ అవుతుందని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: