దగ్గుపాటి రానా నట విశ్వరూపానికి మారుపేరు... దగ్గుబాటి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రానా.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఔరా అనిపించాడు. ఎలాంటి హావభావలనైనా   ముఖంలో పలికించగల సత్తా  రానా సొంతం. రానా చూపించే క్రూరత్వానికి సినిమా చూసే ప్రేక్షకుడు కూడా భయపడి పోతాడు. అందుకే రానా నటనకి అభిమానులు ఎంతో మంది. భారీకాయం తో రానా పలికించే రౌద్రం ఇంకే నటుడు పలికించలేడేమో  అనిపిస్తుంది. ఓవైపు హీరోగా పలు సినిమాల్లో చేస్తూనే మరోవైపు.. మరోవైపు పవర్ఫుల్ పాత్రలో నటిస్తూ తన నట విశ్వరూపం తో అభిమానులను అలరిస్తున్నాడు దగ్గుపాటి రానా. 

 

 

 ప్రస్తుతం దగ్గుపాటి రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకులు విరాటపర్వం అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా రానా  ఆరోగ్యం బాగాలేక... చికిత్స కోసం విదేశాలకు వెళ్లడం తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈమధ్య రానా మళ్ళీ హైదరాబాద్ తిరిగి రావడంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావడానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానా హీరోగా నటిస్తున్న విరాట పర్వం సినిమా నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే కథ అని అంటున్నారు. 

 

 

 పదిమందికి మంచి జరగాలని అనే  ఉద్దేశంతో... పోరాడే చెడ్డ వ్యక్తి గా దగ్గుపాటి రానా విరాటపర్వం సినిమాలో  కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. రానాకు కెరీయర్ లో  ఇప్పటివరకు చేసిన పాత్రలు అన్నింటిలో విరాటపర్వంలో చేస్తున్న పాత్ర ఎంతో ప్రత్యేకమైనది గా నిలిచి పోతుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఈ  సినిమాలో  రానా సరసన నటిస్తున్న సాయి పల్లవి కూడా కొత్త గా కనిపిస్తుందని... సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ వెంటనే సాయి పల్లవి పాత్ర కరెక్ట్ అయిపోతుందని సమాచారం. సాయి పల్లవి రాణా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మామూలుగానే రానా ఏ పాత్రలోనైనా తన నటనతో జీవిస్తాడు... అలాంటిది నక్సలైట్ ఉద్యమ నేపథ్యం ఉన్న పాత్రలో నటిస్తున్నాడు అంటే నటన ఇంకా ఏ రేంజిలో ఉంటుందో అని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: