తెలుగు సినిమాల్లో మదర్ సెంటిమెంట్‌ని ఆధారంగా చేసుకొని.. ఎందరో సినీ రచయితలు ఎన్నో గీతాలు రాశారు. అందులో బాగా పాపులరైన కొన్ని గీతాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.  20వ శతాబ్దం (1990)లో `అమ్మ‌ను మించి దైవ‌మున్న‌దా ఆత్మ‌ను మించి అద్ద‌మున్న‌దా` జ‌గ‌మే ప‌లికే శాశ్వ‌త స‌త్య‌మిది` అనే సెంటిమెంట్ పాట అప్ప‌ట్లో మంచి పాపుల‌ర్ అయింది.  జె.వి.రాఘవులు సంగీతాని్న స‌మ‌కూరిస్తే..


 ఎస్.పి.బాలు, పి.సుశీల క‌లిసి ఈ పాట‌ను పాడారు. త‌ర్వాత అమ్మా రాజీనామా నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి ర‌చించిన పాట - కె.ఎస్.చిత్ర పాడారు.`ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం``ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం`అమ్మ ప్రేమ‌లోని క‌మ్మ‌ద‌నాన్ని చాటి చెపుతో చాలా బాగా ర‌చించారు.

 

 మ‌హేష్‌బాబు న‌టించిన నాని చిత్రంలోని ఈ పాట `పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ`కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ` చంద్ర‌బోస్ రాసిన ఈ పాట. సాధనా సర్గమ్, ఉన్ని క్రిష్ణన్ పాడారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన చిత్రం అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చక్రి సంగీతం అందిస్తున్న ఈ పాట‌`నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..` అప్ప‌ట్లో అమ్మ పాట‌ల్లోనే మంచి ట్రెండీగా ఉన్న సాంగ్ ఇది అని చెప్పాలి. 

 

ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో వేటూరి సాహిత్యం అందించిన పాట `అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన`నాన్నంటే నీలాకాశం తల వంచేనా` విద్యాసాగ‌ర్ సంగీతాన్ని స‌మ‌కూరిస్తే...బాలు, చిత్ర క‌లిసి ఈ పాట‌ను పాడారు. రఘువరన్ బీటెక్ చిత్రంలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట‌కి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్ జానకి, దీపు ఈ పాట‌ను పాడారు. అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా. ఇలా ఎన్నో పాట‌లు మ‌రెన్నో మ‌ధుర గీతాలు అమ్మ పైన ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: