ప్రస్తుతం సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక చారిత్రక నేపథ్యంలో వస్తున్న మూవీస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే పద్మావత్, మణికర్ణిక సూపర్ హిట్ అయ్యాయి. ఇక  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన తాజా మూవీ‘తానాజీ’. 17వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన ఛత్రపతి శివాజీ మహారాజ్.. దగ్గర సుబేదార్‌గా పనిచేసి ఆయన ఎన్నో విజయాల్లో కీలక భూమిక పోషించిన తానాజీ‌ జీవిత చరిత్ర ఆధారంగా అదే  ‘తానాజీ’ టైటిల్‌తో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ నెల 10వ తేదీన విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. రిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే హరియాణా ప్రభుత్వం పన్ను మినహాయిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

సినిమా 10 రోజుల్లో మొత్తంగా రూ. 150 కోట్ల వసూళ్లను రాబట్టి రూ. 200 కోట్ల దిశగా ప్రయాణిస్తోంది. ఈ శుక్ర‌వారం స్ట్రీట్ డ్యాన్స‌ర్‌, పంగా చిత్రాలు విడుద‌లైన‌ప్ప‌టికి తానాజీ త‌న హ‌వాని చూపిస్తూనే ఉంది.  విడుద‌లైన మూడో రోజుకి  తానాజీ చిత్రం 50 కోట్ల వ‌సూళ్ల రాబ‌ట్ట‌గా, ఆరో రోజుకి 100 కోట్లు, 8వ రోజుకి 125 కోట్లు, 10వ రోజుకి 150 కోట్లు, 11వ రోజుకి 175 కోట్లు, 15వ రోజుకి 200 కోట్ల మార్క్ చేరుకుంది. నార్త్‌లో ఈ మూవీ స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతుంది. ఈ మూవీలో టైటిల్ పాత్రని అజ‌య్ దేవ‌గ‌ణ్ పోషించ‌గా, ఆయన భార్య సావిత్రిబాయి మలుసరే పాత్రలే అజయ్ నిజ జీవిత భాగస్వామి కాజోల్ నటించడం విశేషం.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ మూవీలో విలన్‌గా నటించిన శరత్ కేల్కర్ ఈ మూవీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించాడు. పూర్తి యాక్షన్ నేపథ్యంలో  తెర‌కెక్క‌గా ఇందులోని  యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీ విజయం గురించి ఇప్పటికే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్స్ లో మునిగిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: