స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల .. వైకుంఠపురములో ఈ సంక్రాంతి కానుకగా విడుదలై  బాక్సాఫీస్ వద్ద  కాసుల వర్షం కురిపిస్తుంది.  సినిమా విడుదలై ఇప్పటికి  రెండు వారాలు అవుతున్న వసూళ్ల లో జోరు తగ్గడం లేదు.  13వ రోజు ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1.58 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా ..  మొత్తంగా అక్కడ 111కోట్ల షేర్ ను రాబట్టింది. 
 
ఇక ఇంతకుముందు  ఇండస్ట్రీ హిట్ బాహుబలి తెలుగు రాష్ట్రాల్లో  మొత్తం 114 కోట్ల షేర్ ను రాబట్టింది.  దాంతో అల మరో 3కోట్ల ను రాబడితే చాలు  బాహుబలి రికార్డు ను  బ్రేక్ చేసి  టాలీవుడ్ లో  నెంబర్  2 సినిమాగా రికార్డు సృష్టించనుంది.  ఈరెండు రోజుల్లో ఆ మూడు కోట్లను  సులభంగానే  రాబట్టుకోనుంది. ఓవరాల్ గా  ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా 13రోజుల్లో 136కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. 
 
13రోజులకు గాను తెలుగురాష్ట్రాల్లో అల.. వసూళ్ల వివరాలు : 
 
నైజాం - 36.21 కోట్లు 
సీడెడ్ - 16.40 కోట్లు 
ఉత్తరాంద్ర - 17.21 కోట్లు 
గుంటూరు -9.88 కోట్లు 
తూర్పు గోదావరి - 9.91 కోట్లు 
పశ్చిమ గోదావరి - 7.88 కోట్లు '
కృష్ణా - 9.54 కోట్లు 
నెల్లూరు - 3.97 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో 13రోజుల షేర్ = 111.00కోట్లు 
 

మరింత సమాచారం తెలుసుకోండి: