రేడియో జాకీ గా పనిచేసిన ఎనేర్జిటిక్ కుర్రాడు ప్రదీప్.. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. జీ తెలుగులో వచ్చిన గడసరి అత్తా సొగసరి కోడలు చిత్రం ద్వారా మంచి పాపులారిటీని సందించుకున్నాడు. అలా బుల్లి తెరలో పరిసామవుతున్న షో ల ద్వారా బాగా పేరును తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పుడు బుల్లి తెర మాంత్రికుడిగా మారాడు. 

 

యాంకర్ ప్రదీప్ హీరోగా `30 రోజుల్లో ప్రేమించటం ఎలా?` అనే రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ఆర్య 2, నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయన ఈ సినిమాకు కథ మాటలు కూడా అందిస్తున్నాడు.

 

షూటింగ్ పనుల ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ లో బిజీ గా ఉన్నారు. శనివారం ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ లను యంగ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. పోస్టర్‌ రిలీజ్ చేసిన రానా చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పోస్టర్‌ తో పాటు మ్యూజిక్‌ కూడా ఆకట్టుకునే లా ఉందని చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 

 

ఢిపరెంట్‌గా డిజైన్‌ చేసిన ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ప్రదీప్‌ పల్లెటూరి యువకుడి గా కనిపిస్తున్నాడు. హీరోయిన్‌ అమృత అయ్యర్‌ లుక్‌ను కూడా ఈ పోస్టర్‌ లోనే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టైటిల్‌ డిజైన్‌ లోనూ ఎంత కేర్‌ తీసుకొని స్పెషల్‌ గా డిజైన్‌ చేయించుకున్నారు. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం ఇవన్నీ చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ కొత్త ఉంటుందన్న భావన కలుగుతోంది. బుల్లితెర హీరోగా ఆకట్టుకున్న ఈ కుర్రాడు వెండి తెరమీద ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: