మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. తమ అభిమాన హీరో సినిమా వస్తున్నట్టు కాకుండా.. తమకు అనుబంధమైన హీరో తమకు ఆనందం పంచడానికి వస్తున్నాడనే భావనే ఉంటుంది. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ప్రేక్షకులు కూడా.. చిరంజీవి సినిమా వస్తోందంటే మంచి ఎంటర్ టైన్మెంట్ ఖాయం అనే భావనతో ఎదురుచూస్తూంటారు. ఆయన నటించిన ఖైదీ నెం.150, సైరా సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడం మెగాస్టార్ క్రేజ్ ఏంటో తెలియజేసింది. ఇప్పుడు ఆయన తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు.

 

 

సినిమా కోసం చిరంజీవి రేయింబవళ్లు కష్టపడుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. నైట్ షెడ్యూల్స్ లో కూడా పాల్గొంటూ కష్టపడుతున్నాడట. ఈ సినిమా అనుకున్న టైమ్ కంటే కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. చిరంజీవి లుక్ కోసం నెలకు పైగా ఆలస్యమైంది. ప్రస్తుతం డేనైట్ షెడ్యూల్స్ చేస్తూ ఏప్రిల్ కి సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఇందుకు సంబంధించి దర్శకుడు కొరటాల శివకు కూడా క్లియర్ గా ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాడట. మొన్న సరిలేరు.. ప్రీరిలీజ్ ఫంక్షన్ లో కూడా ఇదే మాట వేదికపైనే కొరటాలకు చెప్పాడు. దీంతో షూటింగ్ ను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కోకాపేటలో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం.

 

 

కొరటాల సినిమా దాదాపు నాలుగైదు నెలల సమయం తీసుకుంటాడు. కానీ ఈ సినిమాను మూడు నెలల్లో పూర్తి చేయాలి. షూటింగ్ లేట్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయట. దీంతో షూటింగ్ కు కొరటాల పెద్దగా కష్ఫపడటంలేదని అంటున్నారు. ఈ ఏడాది వేసవికే సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: