మాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా డిస్కో రాజా. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, రాజ్ పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటించారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తర్వాత వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించాడు. వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత రవితేజ ఈ సినిమాతో గట్టిగా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. చాలా టైం కూడా తీసుకొని ఈ సినిమాని హాలీవుడ్ సినిమాగా తీశామని చెప్పారు. అయితే థియోటర్స్ లో బొమ్మ పడ్డాక ఇది ఏ రేంజ్ హాలీవుడ్ సినిమానో అందరికీ అర్థమైపోయింది. 

 

ఇప్పటి వరకు వరసగా ఫ్లాపయిన మూడు సినిమాల కంటే ఈ సినిమా ఇంకా దారుణమని మాస్ రాజా ఫ్యాన్సే ఫీలవుతున్నారు. ఇక కామన్ ఆడియన్స్ అయితే అనవసరంగా సినిమాకెళ్ళి బుర్ర పాడు చేసుకోవడం ఎందుకులే అనుకొని ఫ్లాప్ టాక్ విని డిసైడయ్యారట. పాపం ఇదేంటో రవితేజ ఏం చేద్దామనుకున్న తిరిగి ఆయనకే షాకిస్తుంది. రవితేజ ఇప్పటివరకు ఇలాంటి జోనర్ లో సినిమా చేయలేదు కాబట్టి గ్యారెంటీగా సినిమా హిట్ అనుకుంటే బెడిసికొట్టింది. ఈ దేబ్బతో రవితేజ ఏంచేయాలో తోచక కన్‌ఫ్యూజన్ లో ఉన్నాడట. మరో వైపు అందరు ఏంటి రవి ఇలా డిసప్పాయింట్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారట. 

 

 ఇక ఈ సినిమాకి ముందు నుంచి చాలా హైలెట్స్ ఉన్నాయని అవన్ని మాస్ రాజా ఫ్యాన్సే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ బాగా ప్రచారం చేశారు. వాస్తవంగా చూస్తే రవితేజ కి మాస్ ఆడియన్సే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ముందు నుంచి బాగానే ఉన్నారు. వాళ్ళందరు రవితేజ సినిమా అంటే ఖచ్చితంగా ఎంతో ఆసక్తిగా థియోటర్స్ కి వస్తారు. అయితే ఆ మధ్య వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వచ్చిన ప్రతీ సినిమాతో అందరినీ డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే డిస్కోరాజా రిజల్ట్ తో రవితేజ బాగా డిసప్పాయింట్ అయ్యాడని ఇక మీదట సినిమాలు మానేస్తే బెటరన్న ఆలోచనకి వచ్చాడని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. చెప్పాలంటే రవితేజ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవిలా ఏ అండ దండలు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ ని సంపాదించుకున్నాడు. ఈ తరం యంగ్ హీరోలకి ఒక మోరల్ అని కూడా చాలామంది చాలా సందర్భాల్లో బహిరంగాగానే చెప్పారు. ఏదో బ్యాడ్ టైం వల్ల 3-4 ఫ్లాపులు వస్తే సినిమాలకి ఎలా గుడ్ బాయ్ చెపాడు.. మాట అనే ముందు ఒకసారి ఆలోచించాలి కదా ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: