మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా సినిమా డిస్కో రాజా ప్రస్తుతం పర్వాలేదనిపించేలా ముందుకు సాగుతోంది. రవితేజ రెండు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాలో హీరోయిన్స్ గా నభ నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా యువ దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఒక సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుందని, అయితే సెకండ్ హాఫ్ ని మాత్రం దర్శకుడు ఆనంద్, ప్రేక్షకులను ఆకట్టునే రేంజ్ లో తెరకెక్కించలేకపోయాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. 

 

ఇప్పటికే వరుసగా మూడు ఫ్లాప్స్ అందుకుని ఢీలాపడ్డ రవితేజ కెరీర్ కి ఈ సినిమా ఏమాత్రం మేలు చేయలేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే మాస్, యాక్షన్ సినిమాలో నటిస్తున్న రవితేజ, తన తదుపరి సినిమాని కాసేపటి క్రితం ప్రకటించారు. గతంలో తనతో వీర అనే ఫ్లాప్ మూవీని తెరకెక్కించిన రమేష్ వర్మకు ఈ సినిమా ద్వారా మరొకసారి అవకాశం ఇచ్చిన రవితేజ, ఫిబ్రవరి నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. 

 

ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో రవితేజ ఆయనకు దర్శకుడిగా మరొక అవకాశం ఇచ్చారని అంటున్నారు. అయితే రాక్షసుడు ఒక రీమేక్ మూవీ కావడంతో, తదుపరి రవితేజతో ఆయన తీయనున్న సినిమా దానివలె రేమేకా లేక స్ట్రెయిట్ సినిమానా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏ స్టూడియోస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ తో పాటు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈసారైనా రవితేజ, రమేష్ వర్మల కాంబోలో హిట్ వస్తుందో రాదో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: