హైదరాబాద్ మహానగరంలో రోజు అర్ధరాత్రి సరిగ్గా రెండు గంటల 26 నిమిషాలకు చోటు చేసుకున్న భూకంపం అక్కడితో ఆగకుండా గంట వ్యవధిలో మరొక రెండు సార్లు కూడా వచ్చింది. సికింద్రాబాద్, మారేడ్పల్లి మరియు గచ్చిబౌలిలోని ప్రజలంతా భయబ్రాంతులకు లోనై ఇళ్లలో నుండి బయటకు పరిగెత్తారు. ఏడు నుంచి పది సెకండ్లు నిడివి ఉన్న భూకంపం వల్ల అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 

ఇకపోతే రెండున్నర గంటల సమయంలో వచ్చిన భూకంపం నుండి కొద్దిగా కోలుకుని మళ్లీ ప్రజలు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్న సమయంలోనే మరొక రెండు సార్లు రావడం వారిని రోజు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది. భూకంపం నల్గొండ జిల్లాలో మొదలు కాగా దాదాపు 10 మీటర్ల లోతులో ఉన్న దీని ప్రకంపనలు మొట్టమొదటిసారి నల్గొండ జిల్లాలో విస్తరించినట్లు గా భూగర్భ నిపుణులు కనుగొన్నారు. రిక్టర్ స్కేల్పై 4.6 నుండి 4.8 మధ్య దీని తీవ్రత నమోదవగా పై ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇది అంత ఆందోళన పడవలసిన సంఖ్య కావడం కొద్దిగా ఊపిరి పీల్చుకునే విషయం.

 

గతంలోనే భూగర్భ నిపుణులు చెప్పింది ఏమిటంటే హైదరాబాదులో కొంచెం తీవ్రత ఎక్కువగా ఉన్నా భూకంపం వస్తే నగరం తట్టుకునే పరిస్థితిలో లేదు అని. ఇటువంటి సమయంలోనే అర్ధరాత్రి వచ్చినా భూకంపం నగర ప్రజలు అందరినీ భయబ్రాంతులకు గురి చేయగా అందుకు సంబంధించిన అధికారులు అంతా తగిన కసరత్తులు చేస్తున్నారు. ఇకపోతే సీఎం కార్యాలయం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా ప్రజలు మాత్రం నిద్ర మానుకొని ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: