విజయ్ సేతుపతి సినిమాలు  ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  ఆయన సినిమాలు వరసగా హిట్స్ కొడుతున్నాయి.  సినిమా సినిమాకు అయన పేరిణీతి చెందుతున్నాడు.  సినిమాల విషయంలో అయన తీసుకునే నిర్ణయాలు, ఛాలెంజ్ లు అద్భుతం అని చెప్పాలి.  ప్రతి సినిమాకు అయన గ్రెస్ పెరుగుతూనే ఉన్నది.  ఇప్పుడు ఈ స్టార్ హీరో కన్ను టాలీవుడ్ పై పడింది.  టాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు.

 టాలీవుడ్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  
ముఖ్యంగా టాలీవుడ్ లో మెగా హీరోలు విజయ్ సేతుపతి కోసం పరుగులు తీస్తున్నారు. విజయ్ సేతుపతి మెగాస్టార్ సైరా సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు.  పాండియన్ రాజుగా అయన నటించిన విధానం మెప్పించింది.  సినిమా సూపర్ హిట్టైంది.  సినిమా సూపర్ హిట్ కావడంతో విజయ్ సేతుపతి డిమాండ్ పెరిగింది.  ఇప్పటికే ఈ హీరో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాలో నటిస్తున్నారు.  అయితే, ఇందులో ఆయన ఎలాంటి పాత్ర చేస్తున్నారు అన్నది తెలియడం లేదు.  


ఇకపోతే, ఈ సినిమాతోపాటుగా అయన మరో సినిమా కూడా చేస్తున్నారు.  అదే బన్నీ సినిమా.  బన్నీ 20 వ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం.  సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.  ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన సినిమా ఇది.  ఈ మూవీ ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  ఈ సినిమా తోపాటుగా విజయ్ మరో మెగా హీరో వరుజ్ తేజ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.  


వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలో ఈ హీరో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇలా వరసగా మెగా హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్న సందర్భంగా అయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. తెలుగు సినిమాల్లో విలన్ గా, తమిళ్ సినిమాల్లో హీరోగా చేస్తూ మెప్పిస్తున్నారు.  ఇలా వరసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న ఈ హీరోకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.  దట్ ఈజ్ విజయ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: