చిరంజీవి రాఘవేంద్ర రావు కాంబినేషన్లో దాదాపుగా 14 సినిమాలు వచ్చాయి.  అందులో సింహభాగం వరకు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి.  కొన్ని ఫెయిల్ అయ్యాయి.  వీరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి కూడా ఒకటి.  ఇదిలా ఉంటె, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా మోసగాడు.  ఈ సినిమాలో మెయిన్ హీరో శోభన్ బాబు.  అయితే, ఇందులో చిరంజీవిని కూడా తీసుకున్నారు.  


చిరంజీవి అప్పటి వరకు చిన్నచిన్న పాత్రలే చేస్తుండేవాడు.  ఈ సినిమాలో శ్రీదేవి డ్యూయల్ రోల్ చేసింది.  ఒకటి పాజిటివ్ రోల్ కాగా, రెండో సినిమా నెగెటివ్ రోల్.  నెగెటివ్ రోల్ లో ఈ స్టార్ నటి అద్భుతంగా నటించింది.  నెగెటివ్ రోల్ కు జోడిగా చిరంజీవిని తీసుకున్నారు.  ఈ నెగెటివ్ రోల్ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు.  శ్రీదేవికి పోటీగా చేసిన ఈ సినిమా మెప్పించింది.

 
ఇక ఇదిలా ఉంటె, మోసగాడు సినిమా చేసిన ఐదేళ్ల తరువాత మెగాస్టార్ తో అడవి దొంగ సినిమా చేశారు.  చిరంజీవి హీరోగా, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది.  ఏ సినిమాతో మెగాస్టార్ మాస్ హీరోగా నిలబడిపోయారు.  మాస్ హీరోగా సినిమా మెప్పించింది.  ఈ సినిమా తరువాత ఇద్దరి మధ్య అనుబంధం బలంగా పెరిగిపోయింది.  ఆ అనుబంధంతోనే మెగాస్టార్ ను రాఘవేంద్ర రావు బాబాయ్ అని పిలిచేవారట.

  
చిరంజీవిని అలా పిలవడం ఏంటని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా... ఒక నటుడి నుంచి మంచి నటన రాబట్టుకోవాలి అంటే, ఆ దర్శకుడికి నటుడికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండాలి.  అప్పుడే మంచి నటన వస్తుంది.  అందుకే చిరంజీవితో రాఘవేంద్రరావు సాన్నిహిత్యం పెంచుకున్నారు.  ఆ సాన్నిహిత్యంతోనే మెగాస్టార్ ను అలా పిలిచేవారట.  అదే ఇద్దరి మధ్య కంటిన్యూ అవుతూ వచ్చిందని అంటున్నారు మెగాస్టార్.  మొత్తానికి మెగాస్టార్, రాఘవేంద్రరావు మధ్య ఏర్పడిన ఆ బంధం కారణంగా దాదాపుగా ఇద్దరు కలిసి 14 సినిమాలు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: