మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిస్కో రాజా. దాదాపు ఏడాదిన్నర తర్వాత డిస్కో రాజా సినిమాతో వచ్చాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఈయన నుంచి సినిమాలు రాలేదు. రవితేజ సినిమా అంటే ఒకప్పుడు చాలా అంచనాలు.. నమ్మకాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. దీంతో మాస్‌ మహారాజా ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.

 

రాజా ది గ్రేట్‌తో ఆ మధ్య హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ త‌ర్వాత అదే టెంపో కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. అయితే ఆ సారి విభిన్న‌మైన క‌థ‌తో డిస్కో రాజా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు రవితేజ. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది.  పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్‌లు హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాలో  మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ సినిమా యావరేజ్ అనిపించుకున్నా, రవితేజ చేసిన డిస్కో రాజా పాత్రకి మాత్రం థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

 

 ఏదో సైన్ ఫిక్షన్ చెప్పబోతున్నారు అని చూపించి, రెగ్యులర్ రివెంజ్ డ్రామా చెప్పడంతో సినిమా కాస్త నిరాశపరిచింది. ఇక ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా.. ఒక్కక్ష‌ణం లాంటి భిన్న‌మైన సినిమాల తర్వాత విఐ ఆనంద్‌ చేసిన సినిమా కావ‌డంలో.. విడుద‌ల‌కు ముందు అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అయితే డిస్కో రాజా పెద్దగా టాక్ తెచ్చుకోలేక‌పోయింది. మరియు థియేటర్స్ కూడా ఎక్కువగా లేనందున రెండవ రోజు కలెక్షన్స్ బాగా తగ్గిపోవ‌డంతో రాజా క‌థ ముగిసిన‌ట్టే అని టాక్ వినిపిస్తోంది. మొదటి రోజు 2.58 కోట్ల షేర్ సాధించిన డిస్కో రాజా రెండవ రోజు 1.65 కోట్ల షేర్ ఓకె అనిపించింది.

 

‘డిస్కో రాజా’ ఆంధ్ర – తెలంగాణ 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

 

నైజాం – 1.8 కోట్లు

 

సీడెడ్ – 57.9 లక్షలు

 

గుంటూరు – 28.3 లక్షలు

 

ఉత్తరాంధ్ర – 51 లక్షలు

 

తూర్పు గోదావరి – 33.5 లక్షలు

 

పశ్చిమ గోదావరి – 25.6 లక్షలు

 

కృష్ణా – 30.4 లక్షలు

 

నెల్లూరు – 17.2 లక్షలు
----------------------------------------------
2 డేస్ మొత్తం షేర్ – 4.23 కోట్లు
----------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: