కొన్ని కొన్ని కాంబినేషన్లు సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. హీరో - హీరోయిన్, హీరో – దర్శకుడు.. ఇలా కాంబినేషన్లు చాలా ఆసక్తిని రేకెత్తిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాకే ఇలాంటి కాంబినేషన్లు కుదిరితే ఇక చెప్పేదేముంది. అంచనాలు ఆకాశాన్నంటుతూంటాయి. ప్రస్తుతం మెగాస్టార్ తన 152వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్ విషయంలో మరో ఆసక్తికర న్యూస్ రౌండ్ అవుతోంది.

 

 

ఈ సినిమాలో త్రిషతో పాటు స్వీటీ అనుష్క కూడా నటించే అవకాశాలు ఉన్నాయనేది ఫిలిం నగర్ సమాచారం. ఓ ముఖ్యమైన పాత్ర కోసం అనుష్కను యూనిట్ సంప్రదించిందని సమాచారం. అనుష్క సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశం లేదు కాబట్టి.. ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయ్యుంటందనే అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం గాసిప్ మాత్రమే అయినా.. ఈ వార్త సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ వార్త సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ సినిమా యూనిట్ ఇవ్వాల్సి ఉంది. సైరాలో అనుష్క పాత్రను సినిమా రిలీజ్ అయ్యాకే ప్రేక్షకులు తెలుసుకోగలిగారు. అంతగా అనుష్క పాత్రపై సీక్రెట్ మెయింటెన్ చేశారు.

 

 

త్రిషతో పాటు అనుష్క కూడా సినిమాలో ఉంటే సినిమాకు మరింత కలర్ వచ్చినట్టే. స్టాలిన్ లో స్పెషల్ సాంగ్, సైరాలో ముఖ్య పాత్ర తప్ప ఇంతవరకూ చిరంజీవితో ఫుల్ లెంగ్త్ రోల్ చేయలేదు అనుష్క. స్టాలిన్ లో కూడా త్రిష హీరోయిన్.. అనుష్క స్పెషల్ అట్రాక్షన్. అనుష్కపై వస్తున్న వార్త నిజమైతే స్టాలిన్ కాంబినేషన్ రిపీట్ అయినట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: