రాజకీయ నాయకుల వారసులు రాజకీయ నాయకులవడం.. హీరోల కొడుకులు హీరోలవడం అందరికి తెలిసిందే. అయితే సినిమా పరిశ్రమ చాలా పెద్దది ఇక్కడ టాలెంట్ ఉంటే ఎవరైనా సరే సత్తా చాటే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా సరే టాలెంట్ చూపిస్తే చాలు వాళ్లకు క్రేజ్ వచ్చేస్తుంది. అయితే ఈ టైంలో కేవలం హీరోల కొడుకులే కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వారి కొడుకులు, కమెడియన్ వారసులు హీరోలుగా చేస్తున్నారు.

 

బ్రహ్మానందం తనయుడు గౌతం ఆల్రెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతనికి ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు. ఇక లేటెస్ట్ గా బ్రహ్మాజి కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బ్రహ్మాజి కొడుకు సంజయ్ హీరోగా చెందు ముద్దు డైరక్షన్ లో వస్తున్న సినిమా ఓ పిట్టకథ. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం రిలీజ్ చేయడం విశేషం. 

 

టైటిల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో ఈ సినిమా కథ తనకు తెలుసని.. డైరక్టర్ 2, 3 టైటిల్స్ చెప్పగా తనకు ఓ పిట్టకథ చాలా బాగా నచ్చిందని.. అదే చిత్రయూనిట్ ఫైనల్ చేసిందని అన్నారు త్రివిక్రం. ఓ పిట్టకథ పోస్టర్ చూస్తే.. ఓ కారు.. పక్కనే స్టూల్ మీద ఓ కప్ లో ఏదో జ్యూస్ తో పాటుగా.. కాఫీ గిన్నె కనిపిస్తుంది. త్రివిక్రం అంత ఇంట్రెస్ట్ గా చెప్పాడు అంటే కచ్చితంగా సినిమాలో కూడా విషయం ఉండే ఉంటుంది. మరి పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. పోస్టర్ డిజైన్ అదిరిపోగా టీజర్ కోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: