వి.ఐ. ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా తెర‌కెక్కిన చిత్రం `డిస్కోరాజా`. ఈ చిత్రం రామ్ తాళ్ళూరి నిర్మించ‌గా.. మాస్‌మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించారు. ఇందులో పాయ‌ల్‌రాజ్‌పుత్, న‌భాన‌టేష్‌, తానియా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ మ‌ధ్య వ‌చ్చిన ర‌వితేజ సినిమాల‌న్నీ కూడా చాలా వ‌ర‌కు ప్లాప్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఈ చిత్రం మీద చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. కానీ ఆ చిత్రం నుంచి కూడా ఆశించినంత హిట్ మాత్రం కొట్ట‌లేక‌పోయాడు. 

 

ఈ చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ నేప‌ధ్యంలో ఓ గ్యాంగ్ స్ట‌ర్ ల‌వ్ అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో డిఫ‌రెంట్‌గా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ ఆశించినంత హిట్ మాత్రం కొట్ట‌లేక‌పోయాడు. దీంతో మరల తన రెగ్యులర్ మార్కెట్ పై దృష్టిపెట్టాలని భావించాడు.ఇక రవితేజతో నేల టికెట్ సినిమా తీశి బొక్క బోర్లా పడ్డ నిర్మాత రామ్ తళ్లూరి మరో సారి రవితేజ మీద నమ్మకం పెట్టుకొని ఈ సైన్సు ఫిక్షన్ చిత్రానికి చాలా భారీ స్థాయిలో బ‌డ్జెట్‌ని పెట్టాడు. ఇక రిలీజ్ కి ముందు వచ్చిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు భాగానే పెంచింది కానీ సినిమా మాత్రం విడుద‌ల‌య్యాక కొంత మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది.

 

కొంత మంది ఫ‌స్ట్ ఆఫ్ చాలా బావుంది అంటున్నారు కానీ సెకండాఫ్ ఎవ్వ‌రికీ అంత‌గా న‌చ్చ‌లేదు. దీంతో ఈ సినిమా యావ‌రేజ్ టాక్‌ని మూట‌గ‌ట్టుకుంది. దానికి తోడు ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలు ఇంకా థియేట‌ర్స్‌లో ఉండ‌డంతో ర‌వితేజ‌కి కాస్త థియేట‌ర్స్ కొర‌త కూడా యాడ్ అయింది. దీంతో ర‌వితేజ కెరియర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ ని ఈ సినిమా రాబట్టింది.

 

సినిమాకి యావ‌రేజ్ టాక్ రావ‌డంతో ఇప్పుడు ఉన్న థియేట‌ర్స్ కూడా నిండ‌డం క‌ష్ట‌మ‌యిపోయింది. ఈ నేప‌ధ్యంలో బ‌య్య‌ర్లు భ‌యంతో బెంబేలెత్తిపోతున్నారు. చివ‌రికి వాళ్ళు పెట్టింద‌న్నా వ‌చ్చుదారాదా తీవ్ర న‌ష్టానికి ప‌డిపోతారా అన్న‌ది వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: