తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి వేసుకున్న పునాది ఆయన్ను మెగాస్టార్ ను చేసింది. ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఎవరినైనా హీరోని, స్టార్ ని, సూపర్ స్టార్ ని చేసింది. పవన్ కల్యాణ్ నుంచి ఆయన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ వరకూ చిరంజీవి కార్డు పట్టుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారే. బలమైన ఫ్యాన్ బేస్, అరడజనకుపైగా హీరోలతో టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ బలంగా ఉంది. కానీ.. ఇటివలి పరిణామాలు మాత్రం మెగా హీరోల మధ్యే కాదు.. మెగా ఫ్యాన్స్ మధ్య కూడా దూరం పెంచుతున్నాయి.

 

 

చిరంజీవి-పవన్ పొలిటికల్ ఎంట్రీనే ఈ చీలికలకు కారణమవుతోంది. పవన్, చరణ్, బన్నీ, సాయి ధరమ్, వరుణ్, శిరీష్, కల్యాణ్ దేవ్.. ఇలా అందరినీ మెగా ఫ్యాన్స్ ఆదరించారు. పవన్ ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారో మెగా ఫ్యాన్స్ విడిపోతున్నారు. చిరు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ అయిపోతున్నారు. బన్నీ కూడా తనకో ఆర్మీ ఉందంటున్నాడు. సీఎం జగన్ ను వ్యతిరేకిస్తూ పవన్, పొగుడుతూ చిరంజీవి వారి ఫ్యాన్స్ మధ్య స్వయంగా చీలికను తీసుకొస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోంది. యాంటీ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి తగవులు పెట్టి విడగొడుతున్నారు.

 

 

నిజమైన మెగా ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి ట్రాప్ లో ఎవరూ పడొద్దని చెప్తూ మెగా ఫ్యాన్స్ ను కోరుతున్నారు. చరణ్, వరుణ్, సాయి ధరమ్ లు.. మనమంతా మెగా ఫ్యాన్సే అని చెప్తున్నా అవి మాటలకే పరిమితమవుతున్నాయి. సినిమాల్లో మెగా హీరోలను, ఫ్యాన్స్ ను ఎదుర్కోని వాళ్లు రాజకీయాలను వాడుకుంటూ వారిలో చీలిక తెస్తున్నారు. చిరంజీవితో సహా మెగా హీరోలకు ఇది ఎంతో నష్టం. తమ రాజకీయ ప్రయోజనాలకు ఫ్యాన్స్ బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చిరంజీవిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: