శుక్రవారం అశ్వథ్థామ సినిమా రిలీజ్ సందర్భంగా నాగ శౌర్య తన సినిమా ప్రమోషన్లు వేగవంతం చేసాడు. ఈ మేరకు మన హీరో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అశ్వథ్థామ కథ తన రాసుకున్నది కాబట్టి, కుర్రోడు ఈ సినిమా పై ఎక్కువ మమకారమే పెంచుకున్నాడు. అందులో భాగంగా సినిమా చిత్రీకరణ సమయంలో కూడా ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు డైరెక్టర్లపైన, రైటర్లపైన, ఇతర సాంకేతిక వర్గంపైనా కోప్పడుతూ పనులు చేయించుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. 

 

విషయమేంటంటే తను చేసిన దానికి కుర్రోడు ఏమైనా సారీ చెప్తాడనుకుంటే, అబ్బే ఆ ఉద్దేశమేం లేనట్టు, నేను ఎంత కోప్పడినా అది సినిమా క్వాలిటీ కోసమే, ఆ క్వాలిటీ అనేది వారి భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది కదా అంటూ తను చేసిన పనిని అందంగా సమర్ధించుకున్నాడు. ఇది విన్న నెటిజన్లు ప్రస్తుతానికి పాపం శౌర్య ని  సోషల్ మీడియా లో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. 

 

ఏ మనిషికైనా కోపం ఏదో ఒక కారణం వల్లే వస్తుంది. మనిషి మీద కోప్పడి అది వాళ్ళ బాగు కోసమే అంటే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. అది తెలుసుకోకుండా, తనని తాను సమర్ధించుకోవడమేంటని శౌర్య సోషల్ మీడియా అకౌంట్ ని ట్యాగ్ చేసి మరీ ఆడేసుకుంటున్నారు. మరి తన సినిమా విడుదల కి సిధ్ధంగా ఉందని ఎందుకొచ్చిన గోల అని, తన స్టేట్మెంట్ పైన వివరణ ఇస్తాడా, లేదా పోతే పోనీ అనుకుంటాడా అనేది చూద్దాం. అయితే తన ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక గొడవ జరగడం దానికి నాగ శౌర్య కారణం అవడం చూసి ఈ హీరో మీద నెగటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అయితే ఇదంతా చేసేది కేవలం సినిమా అవుట్ పుట్ బాగా రాడానికే అంటున్నాడు నాగ శౌర్య. ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటా అని అంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: