బాలీవుడ్ సినిమా పరిశ్రమకు షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దీపికా పడుకొనే, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక అక్కడినుండి మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన దీపికా, ఆపై పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. కేవలం బాలీవుడ్ లోనే కాక, కొన్నాళ్ల క్రితం హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ తో కలిసి ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ క్జండర్ కేజ్ అనే సినిమాలో నటించిన దీపికా, దేశ విదేశాల్లో కూడా మంచి పేరు దక్కించుకుంది. ఇక ఇటీవల బాలీవుడ్ యువ హీరో రణ్వీర్ సింగ్ ని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ వివాహమాడిన దీపికా, 

 

వివాహం తరువాత కూడా కొంత సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. మరోవైపు రణ్వీర్ కూడా హీరోగా పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే పెళ్లి తరువాత ఒకింత తెలివిగా వ్యవహరిస్తున్న దీపికా పడుకొనే, నటనతో పాటు ఇటీవల మరోసైడు సినిమా నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టింది. కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చపక్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన దీపికా, ఆ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించింది, ప్రస్తుతం ఆమె భర్త రణ్వీర్ హీరోగా ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 83 మూవీ కి కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది. 

 

ఇకపోతే నేడు హాలీవుడ్ లో 2015లో వచ్చిన ది ఇంటర్న్ అనే మూవీని బాలీవుడ్ రీమేక్ గా అదే పేరుతో తెరక్కుతున్న సినిమా నటిస్తున్నట్లు ప్రకటించింది దీపికా. రిషి కపూర్ తో కలిసి ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న దీపికా, ఆ సినిమాకు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించనుండడం విశేషం. ఈ విధంగా ఓవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు నిర్మాతగా కూడా పెట్టుబడులు పెడుతూ రెండు చేతులా లాభాలతో ముందుకు సాగుతున్న దీపికా తెలివితేటలపై ప్రేక్షకులు ఆసక్తికరంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. వామ్మో, మీ తెలివితేటలకు జోహార్లు మేడం, మీలా అటు నటిగా, ఇటు నిర్మాతగా ఏకకాలంలో వ్యవహరించ గల సమర్ధతతో ఏ హీరోయిన్ కూడా అంత డేరింగ్ స్టెప్ వేయలేదు అంటూ ఆమెపై పొగడ్తలు కురిపిస్తున్నారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: