సంక్రాంతి రేస్ లో సరిలేరు నీకెవ్వరు అనీల్ రావిపూడి కి దిమ్మ తిరిగే షాకిచ్చింది. పైకి ఆహా ఓహో అంటున్నప్పటికి రావిపూడికి మాత్రం గట్టి ఝలక్ పడింది. మహేష్ లాంటి స్టార్ కి బ్యాడ్ టాక్ వచ్చే సినిమాని ఇచ్చి ఘనుడుని అనిపించుకున్నాడు. పటాస్ నుండి వరుసబెట్టి సూపర్ హిట్స్ ని ఇచ్చిన అనిల్ సూపర్ స్టార్ కి మాత్రం మంచి సక్సస్ ని ఇవ్వలేకపోయాడు.

 

అయితే ఎఫ్ -2కి సీక్వెల్ గా ఎఫ్-3 తెరకెక్కించడానికి అనిల్ రెడీ అవుతున్నాడ ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఎఫ్-2 భారీ సక్సెస్ సాధించడంతోనే ఎఫ్-3 తెరకెక్కిస్తామని దిల్ రాజు బృందం గత సంవత్సరమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనీల్ రావిపూడి సీక్వెల్ పని మొదలు పెట్టాడట. ఈసారి కూడా ఎఫ్ -2లో నటించిన వెంకటేష్- వరుణ్ తేజ్ లనే హీరోలుగా తీసుకోచాలని అనుకుంటున్నారు. టైటిల్ కి మరో నంబరు యాడవుతోంది కాబట్టి అదనంగా మాస్ మహా రాజా రవితేజను ఈ టీమ్ కి జాయిన్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ మాట కూడా సంవత్సరం నుంచి చెబుతున్నదే.

 

ఎఫ్-3 బౌండెడ్ స్క్రిప్టు రెడీ అవుతోంది. మరో రెండు మూడు నెలల్లో పూర్తి స్క్రిప్ట్ సిద్దం అవుతుందని అనీల్ తాజాగా వెల్లడించారు. ఈ గ్యాప్ లో కాస్టింగ్ గురించి క్లారిటి వస్తుందట. అయితే సరిలేరు దెబ్బతో ఈ టైమ్ లో ఎఫ్-3 చేయడం కరెక్టా కాదా అన్న డైలమాలోకి వచ్చారట. ఎఫ్-2 బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి కామెడీతో పాటు ఫ్యామిలీస్ లో స్పైసీ యాంగిల్ ని టచ్ చేయడం సినిమాకి అన్ని విధాలా ప్లస్ అయింది. అనీల్ రావిపూడి మార్క్ కామెడీ సినిమాకి బాగా హెల్ప్ అయింది. ఇదే ఫార్ములాని సరిలేరు నీకెవ్వరు కి ఉపయోగించి దెబ్బైపోయాడు.

 

ఎఫ్ 2 చూపించినదే ఎఫ్ 3 లో చూపిస్తానంటే ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయోదాకా కూడా ఉండదు పరిస్థితి అసలు థియోటర్స్ కే రారు. ఇంతకుముందు ఇలా రిపీట్ చేయడం వల్లనే శ్రీనువైట్లు చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో ఫుల్ మూవీ కామెడీ చేయించే ట్రెండ్  మొదలు పెట్టింది శ్రీనువైట్ల అన్న విషయం తెలిసిందే. అందరివాడు సినిమాలో మెగాస్టార్ తోను అద్భుతమైన కామెడీని చేపించారు. ఢీ- రెడీ- దూకుడు- ఆగడు లాంటి చిత్రాలు ఈ తరహాలోనే ఒకే జానర్ కామెడీతో తెరకెక్కాయి.  ఢీ- రెడీ ఒకే జానర్ సినిమాలు...ఒకే రకమైన కామెడీ. అప్పటి ఆడియన్స్ కి అది కొత్త కాబట్టి సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత దూకుడు బ్లాక్ బస్టర్ అయ్యింది. కాని అదే జానర్ కామెడీతో ఆగడు తెరకెక్కించాలనుకుని దెబ్బయిపోయారు. ఈ ఒక్క డిజాస్టర్ శ్రీనువైట్ల కెరీర్ నే లాగి కింద పడేసింది. ఇప్పుడు నువ్వు అదే పిచ్చి పని చేస్తున్నావు. ఈ టైం లో ఎఫ్3 గిఫ్ 3 అని మళ్ళీ అదే జోనర్ లో సినిమా చేయకు ..ఈ సారి గనక ఫ్లాప్ పడితే మళ్ళీ కనపడవు. నీకు అన్నీ తెలుసు కదా ..అంటూ నెటిజన్స్ అనిల్ కి సలాహాలిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: