టాలీవుడ్ హీరో అమ్మాయిల డార్లింగ్ అయిన ప్రభాస్ ఇటీవ‌లె `సాహో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.  క‌థ ప‌రంగా పెద్ద‌గా ఆశించే విధంగా ఆ చిత్రం లేక‌పోయినా క‌లెక్ష‌న్స్ మాత్రం దుమ్ము రేపిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.  ఇక ఇప్పుడు ఆయ‌న రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `జాన్‌` చిత్రంతో బిజీగా ఉన్నారు.  ఇదంతా ఒక ఎత్తైతే ప్ర‌స్తుతం  ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ లో ఉన్నారు.  ఎందుకంటే రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రంతో దాదాపు ఐదేళ్ళు కాపురం చేసిన ప్ర‌భాస్. చాలా గ్యాప్ త‌ర్వాత సాహోతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. 

 

కానీ అది పెద్ద‌గా ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకోలేదు. దాంతో ఫ్యాన్స్ నిరాశ‌లోనే ఉన్నారు. పైగా ఆచిత్రంలో ప్ర‌భాస్ కి మేక‌ప్ కూడా ఎందుకో కుద‌ర‌లేదు. సాహో చిత్రంలో ప్ర‌భాస్ కాస్త ఏజ్డ్ ప‌ర్స‌న్‌లాగా క‌నిపించాడు. దాంతో ఆయ‌న‌కి సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ కూడా బాగానే వ‌చ్చాయి. ప్ర‌భాస్ అంటే ముందు గుర్తొచ్చే అందం. అంత‌టి అంద‌గాడిని చూడ‌టానికి చాలా మంది ఆత్రుత‌ప‌డ‌తారు మ‌రి అలాంటిది ఆ చిత్రంలో ఎందుకో ఆయ‌న ప్రేక్షకుల‌ను మాత్రం అస్స‌లు ఆక‌ట్టుకోలేక‌పోయారు. దీంతో ఆయ‌న మ‌రో చిత్రం ఎప్పుడెప్పుడు వ‌చ్చుద్దా అని క‌ళ్ళుకాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. 

 

ఈ విష‌యంలో ఆయ‌న డైహార్డ్ ఫ్యాన్స్ కి మాత్రం ప్ర‌భాస్ న‌చ్చ‌టంటేదు. సినిమాల విష‌యంలో ఎందుకో చాలా ఆల‌స్యం చేస్తున్నారు. సంవత్స‌రానికి ఆయ‌న నుంచి క‌నీసం రెండు సినిమాలైన కోరుకునే ఫ్యాన్స్‌కి ప్ర‌భాస్ మాత్రం రెండు సంవ‌త్స‌రాల‌కి ఒక సినిమాని అందిస్తున్నారు. ఇందుకు ఆయ‌న ఫ్యాన్స్ కాస్త గుస్సా అవుతున్నారు. మ‌రి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్ర‌భాస్ సినిమాల విష‌యంలో కాస్త వేగం పెంచితే బావుంటుంది. ఇక ఇదిలా ఉంటే ఈసారి మాత్రం ప్ర‌భాస్ త‌న ఫ్యాన్స్ ని నిరాశ ప‌ర‌చ‌కుండా త‌న పుట్టిన‌రోజు అక్టోబ‌ర్ 23న ఫ్యాన్స్‌కి ఓ మంచి స‌ర్‌ప్రైజ్‌ ట్రీట్ రెడీ చేస్తున్నాడని టాక్. ఇక మ‌నం అక్టోబ‌ర్ వ‌ర‌కు వేచి చూడాలి మ‌రి ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి ఏం ఇవ్వ‌బోతున్నారు అన్న‌ది. 

మరింత సమాచారం తెలుసుకోండి: