తెలుగులో సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న వారిలో అగ్రగణ్యుడు దిల్ రాజు. ఒక నిర్మాతగా ఆయనకున్న పేరు మరెవ్వరికీ లేదేమో. దిల్ రాజ్ ఎంచుకున్న సబ్జెక్టులు కావచ్చు... మరేదైనా కావచ్చు కానీ దిల్ రాజుకి సక్సెస్ రేటు చాలా ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజు సినిమాల సంఖ్య చాలా పెరిగింది. వరుసగా రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందువల్ల ప్రతి సినిమా షూటింగ్ కి వెళ్లలేకపోతున్నాడు.

 

 

చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో పమిచేసిన దిల్ రాజుకి ఒక పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే డ్రీమ్ ఉండేది. అయితే అది ఇప్పుడు బాలీవుడ్ పింక్ రీమేక్ తో నెరవెరుతోంది. ఈ చిత్ర టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అనధికారికంగా లాయర్ సాబ్ అనే టైటిల్ చలామణిలో ఉంది. ఈ లాయర్ సాబ్ చిత్రం కోసం దిల్ రాజ్ చాలా కష్టపడుతున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చాలా కష్టపడుతున్నాడట.

 


సాధారణంగా దిల్ రాజు ఈ మధ్య షూటింగ్ లకి వెళ్ళట్లేదట. కానీ లాయర్ సాబ్ చిత్ర షూటింగ్ కి మాత్రం ప్రతి రోజూ హాజరు అవుతున్నాడట. అలా అవడానికి రెండు కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఎక్కువ రోజులు సమయం కేటాయించలేకపోతున్నాడు. అందువల్ల ఉన్న సమయంలోనే షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ పవన్ చుట్టూనే ఉంటున్నాడట.


 

మరో విషయం ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ దండిగా ఉందట. రోజుల్ లెక్కన రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. అందువల్ల రోజులు పెరిగితే రెమ్యునరేషన్ సినిమా వ్యయం ఎక్కువ అవుతుందన్న కారణంతో అలా పెరగకుండా పవన్ కళ్యాణ్ తోనే ఉండి, ముందుగా పవన్ ఉన్న పార్ట్ అంతా కంప్లీట్ చేసే ఆలోచనలో పడ్డాడట. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: