మొదటి సినిమాతోనే మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వరసగా మాస్ ను మెప్పించే సినిమాలు చేస్తూ పోయారు.  ఛత్రపతి సినిమా ప్రభాస్ కు భారీ ఇమేక్ తీసుకొచ్చింది. ప్రభాస్ మాస్ హీరోగా మెప్పించగలడనే నమ్మకాన్ని పెంచింది.  ఛత్రపతి తరువాత ప్రభాస్ కొన్ని క్లాస్ మూవీస్ కూడా తీశారు. 

 

అయితే, ప్రభాస్ మిర్చి సినిమా మాత్రం మరో రేంజ్ లో ఉంటుంది. ఇది క్లాస్ ప్రేక్షకులతో పాటుగా మాస్ ను కూడా మెప్పించింది. సూపర్ హిట్ సినిమాగా నిలబెట్టింది. ప్రభాస్ ప్రభాస్ ఈ సినిమాలో నటించిన తీరు నిజంగా సూపర్ అని చెప్పాలి. కొరటాల డైరెక్షన్ సినిమాకు భారీ ప్లస్ అయ్యింది. సినిమా విషయంలో కొరటాల శివ తీసుకున్న శ్రద్ద మాస్ హీరోకు ప్రధానంగా కలిసి వచ్చింది.  

 

కాకపోతే ఈ సినిమాకు మరో ఆకర్షణ ఫైట్స్.  ఫైట్స్ కంపోజిషన్ సినిమాను తారాస్తాయిలో నిలబెట్టాయి. ప్రభాస్ ను మాస్ హీరోను చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం.  క్లాస్ లుక్స్ తో అమ్మాయిలను పటాయించేసాడు ప్రభాస్. ప్రభాస్ లో మెప్పించే ఎన్నో విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ తో పాటుగా ఆయన నటించిన విధానం సినిమాకు భారీ తనాన్ని తీసుకొచ్చింది. ఇక, తెరపై ప్రభాస్ అనూష జోడి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  

 

కథ పరంగా పెద్దగా కొత్తగా లేకున్నా... కథనాలతో ఆకట్టుకున్నారు. కథనాలు సినిమాకు మూలస్థంభంగా మారాయి.  కథనాల విషయంలో కొరటాల తీసుకున్న శ్రద్దకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. డైలాగ్స్ కూడా సినిమాకు ప్రాణం పోసాయని చెప్పొచ్చు. ఇక ఇటీవలే చేసిన బాహుబలి సినిమాతో ప్రభాస్ మరోస్థాయికి ఎదిగాడు.  ఆల్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.  సాహో సినిమా ఫెయిల్ అయినప్పటికీ బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించింది.  ప్లాప్ అయినప్పటికీ కూడా రూ. 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం అంటే మాములు విషయం కాదు.  రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరోగా ప్రభాస్ చరిత్రలో నిలిచిపోతాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: