దేశంలో మీటూ ఉద్యమం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరోయిన్లు, మరెంతో మంది సీనియర్లు ఎంతోమంది ఈ విషయంపై తమ గళం వినిపించారు. దేశంలోని అన్ని భాషల్లోని నటుల పునాదులే కదిలిపోయేంత ప్రభంజనం వచ్చింది. ఆమధ్య ఉన్నంత వేడి ఇప్పుడు ఈ ఉద్యమానికి లేకున్నా చాపకింద నీరులా మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఇటువంటి చిక్కుల్లో చిక్కుకున్నాడు. తన టీమ్ లోని ఓ డ్యాన్సర్ గణేశ్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

 

 

తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. పోర్న వీడియోలు చూడాలని రోజూ వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. గణేశ్ పై గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చాలానే ఉన్నాయి. నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కూడా గణేశ్ పై కొత్తగా వచ్చేవారిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలే చేసింది. మీటూ ఉద్యమానికి ఊపిరిలూదిన తనుశ్రీ దత్తా సైతం గణేశ్ పై అప్పట్లో నిప్పులు చెరిగింది. నానాపటేకర్ తనను వేధిస్తున్న సమయంలో పక్కనే ఉండి కూడా ఏమీ స్పందించలేదని ఆరోపించింది.

 

 

గణేశ్ ఆచార్య బాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. డ్యాన్సర్ కు ఉండాల్ని స్లిమ్ బాడీకి విరుద్ధంగా చాలా మోటుగా ఉంటాడు గణేశ్. అయినా.. డ్యాన్స్ కు తన బాడీలో రిథమ్ ఉంటుంది. అందుకే సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. తెలుగులో చిరంజీవి, బన్నీ సినిమాలకు కొరియోగ్రఫీ కూడా చేశాడు. మీటూ ఉద్యమం నేపథ్యంలో ఇటువంటి ఘటనలను సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో సదరు డ్యాన్సర్ కేసు కూడా పెట్టడంతో ఈ అంశం ఎన్ని మలుపులు తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది. దీంతో ఇప్పుడు ఎవరి పేరు ఎప్పుడు బయటకొస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారని వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: