టాలీవుడ్ లో ఈమధ్య మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. గతంలో బాలీవుడ్ లో మాత్రమే మల్టీస్టారర్లు వచ్చేవి. ఇప్పటికీ అక్కడే ఎక్కువ. కానీ టాలీవుడ్ లో పరిస్థితి మారింది. ఈ జనరేషన్ హీరోలతో సీనియర్ హీరోలు, స్టార్ హీరో.. హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి భారీ మల్టీస్టారర్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఆసక్తికర మల్టీస్టారర్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ సమాచారం.

 

 

సూపర్ స్టార్ మహేశ్ బాబు, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఓ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. దిల్ రాజు నిర్మాతగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు రౌండ్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కు విజయ్ దేవరకొండ పేరును వంశీ పైడిపల్లి సూచించినట్టు చెప్తున్నారు. దీనికి మహేశ్ కూడా సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి.

 

 

అయితే ఈ న్యూస్ పై ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేకపోయినా ఫిల్మ్ నగర్ లో మాత్రం ఈ వార్త హల్ చల్ చేస్తోంది. మహేశ్ సూపర్ స్టార్ ఇమేజ్, విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ తో ఇద్దరికీ ప్రేక్షకాభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ వార్త నిజమైతే ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ తెరకెక్కుతున్నట్టే. విజయ్ దేవరకొండ ఫైటర్ తో బిజీగా ఉన్నాడు. త్వరలో ప్రారంభమయ్యే మహేశ్ సినిమాలో కూడా చేస్తాడా లేదా అనే విషయంపై సినిమా యూనిట్ గానీ, నిర్మాత, దర్శకులు గానీ, హీరోలు గానీ క్లారిటీ ఇవ్వాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: