రెబల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీ నుండి నట వారసుడిగా వచ్చిన హీరో ప్రభాస్. ఈశ్వర్ సినిమా టైంలోనే అతని కటౌట్ చూసి ఓ పర్ఫెక్ట్ మాస్ హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయని అందరు అనుకున్నారు. అనుకున్నట్టుగానే సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చి బాహుబలిగా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఓ కమర్షియల్ హీరో ఒక సినిమా కోసం ఐదేళ్లు కెరియర్ రిస్క్ లో పెట్టుకోవడం అంటే అది మాములు విషయం కాదు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ అలాంటి రిస్క్ చేశాడు. 

 

అప్పటివరకు టాలీవుడ్ వరకు మాత్రమే ఉన్న ప్రభాస్ స్టామినా ప్రపంచానికి తెలిసేలా చేశాడు రాజమౌళి. టాలీవుడ్ రారాజు ప్రభాస్ రాజు.. ఆయన బాహుబలి సినిమా చూసిన బాలీవుడ్ ఆడియెన్స్ పిచ్చోళ్లయ్యారంటే నమ్మాలి. ప్రభాస్ నామం జపిస్తూ పాహిమాం అనేస్తున్నారు. ఒక్క సినిమాతో హింది మార్కెట్ ను కొల్లగొట్టిన ఎనర్జిటిక్ హీరో ప్రభాస్. అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో పెద్దగా ఆడకపోయినా బాలీవుడ్ లో మాత్రం మంచి హిట్ గా నిలిచింది.

 

ఇక ఇప్పుడు ప్రభాస్ అంటే కేవలం టాలీవుడ్ హీరో పాత్రమే కాదు.. అతనో నేషనల్ హీరో.. ప్రభాస్ ఒప్పుకుంటే చాలు కాని అతనితో వరుసగా బాలీవుడ్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు అక్కడ దర్శక నిర్మాతలు. నేషనల్ వైడ్ గా ఏ తెలుగు హీరోకి రాని క్రేజ్ ప్రభాస్ సొంతమైంది. అందుకే ఇకమీదట ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా కూడా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: