సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లకు హీరోయిన్లు దొరకటం లేదని వార్తలు వస్తూంటాయి. కానీ.. ఓ సినిమాలో చెప్పినట్టు ‘వెతకాలి.. వెతికితే దొరకనిదంటూ ఏదీ లేదు’ అన్నట్టుగా ఉంది వీరి పరిస్థితి. బాలయ్య ఇదే చేస్తున్నాడు. వెతికితే దొరకదా అన్నట్టు తను  బోయపాటి శీను దర్శకత్వంలో హీరోగా చేయబోయే సినిమాకు ఓ హీరోయిన్ ను పట్టుకున్నాడు. సింహ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో తనతో కలిసి ఆడిపాడిన బొద్దుగుమ్మ నమితను ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేయించాడని ఓ వార్త ఫిలింనగర్ లో రౌండ్ అవుతోంది.

 

 

బాలయ్య సినిమాలంటే రొటీన్ అనుకుంటున్న దశలో వచ్చింది సింహ. ఈ సినిమాలో దర్శకుడు బోయపాటి శీను బాలయ్యను చూపించిన విధానంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈసినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన నమిత సినిమాకు గ్లామర్ ను అద్దింది. బాలయ్య అభిమానులు కూడా నమిత అందానికి ఫిదా అయ్యారు. దీంతో సెంటిమెంట్ అనుకున్నాడో ఏమో మళ్లీ నమితను హీరోయిన్ గా తెచ్చుకుంటున్నాడు. సింహకు, ఈసినిమాకు కూడా బోయపాటే దర్శకుడు కాబట్టి సెంటిమెంట్ గా ఉంటుందని ఆలోచించినట్టున్నారు. నమిత ఆమధ్య కన్నడ దర్శకుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన నమిత మళ్లీ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనుంది.

 

 

నమిత 2002లో వచ్చిన సొంతం సినిమాతో పరిచయమైంది. తర్వాత వెంకటేశ్ తో జెమినీ, ప్రభాస్ తో బిల్లాలో నటించినా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. తమిళ్ లో మాత్రం నమిత సక్సెస్ అయింది. అక్కడ నమితకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నమితకు బాలయ్య సినిమాలో అవకాశం వచ్చిన వార్త నిజమైతే ఇది లక్కీ చాన్స్ కిందే లెక్క. నమితపై వస్తున్న ఈ వార్తపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: