కొంతమంది ఐటం భామలని చూస్తే చాలు హీరోయిన్ కూడా పనికిరారు అన్నంత అందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే సెక్సీగా ఉంటారు. హీరోయిన్స్ నాలుగు పాటల్లో కనిపించి కనువిందు చేసినప్పటికి ఒక్క ఐటం సాంగ్ లో హాట్ హాట్ గా వయ్యారాలు పోతూ ఒపు సొంపులని ఊపేసి హీరోయిన్ ని డామినేట్ చేసేస్తారు. అంతేకాదు హీరోలు కూడా కొన్ని సినిమాలలో ఒక్క ఐటం సాంగ్ అయినా ఉండేలా ఆ సాంగ్ లో సెక్సీ భామ ఉండేలా దర్శకులని కోరతారు. కొన్ని సినిమాలకి ఒక్క ఐటం సాంగ్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటుంది. చాలా రిలాక్స్ అయ్యోలా చేస్తుంది. ఇక ఇలాంటి ఐటం సాంగ్స్ నాటి నుండి నేటి వరకు ప్రతీ స్టార్ సినిమాలలో ఉంటూనే ఉన్నాయి. చెప్పాలంటే ఆల్బం లో ఈ ఐటం సాంగే బాగా హిట్టవుతుంది. 

 

ఇక గత కొంతకాలంగా ఈ ఐటం సాంగ్స్ లో క్రేజీ హీరోయిన్స్ కూడా తమ అందాలను ఆరబోయడానికి సిద్దమైపోతున్నారు. క్రేజ్ కి క్రేజ్ సంపాదనకి సంపాదన వస్తాయి కాబట్టి ఎంత గ్లామర్ గా కనిపించడానికైనా అడ్డు చెప్పడం లేదు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ దగ్గర్నుంచి కాజల్ అగర్వాల్, అనుష్క, తమన్న, శృతిహాసన్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఇలాంటి ఐటం సాంగ్స్ లో నర్తించిన వాళ్ళే. ఇక నిర్మాతలు కూడా ప్రత్యేకంగా ఇలా ఐటం సాంగ్ కి సపరేట్ గా బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. కేవలం ఒక్క ఐటం సాంగ్ కి స్టార్ హీరోయిన్స్ కి 50 నుండి 70 లక్షల వరకు ముట్టచెబుతున్నారు.

 

ఇక ఈ మధ్య టాలీవుడ్ బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఐటం భామ నోరఫతేహి. ఈ బ్యూటిని గనక సాంగ్ లో చూస్తే ఇరవై నుండి అరవై ఏళ్ళ వరకు ఎవరైనా చొంగ కార్చుకోవాల్సిందే. ఇప్పటికే తెలుగులో ప్రహాస్, ఎన్.టి.ఆర్ వంటి స్టార్స్ నటించిన సినిమాలలో ఐటం సాంగ్స్ చేసి ఊపు ఊపేసింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి పార్ట్ వన్ లో మనోహరి సాంగ్ లో ముగ్గురు ఐటం భాలలో ఒక భామగా నర్తించింది నోరాఫతేహి. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఎన్.టి.ఆర్ టెంపర్, అలాగే వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలలో ఐటం సాంగ్స్ చేసి కుర్రకారుని చంపేసింది. ఇక బాలీవుడ్ లో నోరా దిల్‌బర్ దుల్‌బర్ రీమిక్స్ సాంగ్ లో నడుమొపులతో యూత్ నరలాను తెమేసింది. అలాంటి సాంగ్స్ లో నోరా నడుము చూస్తే ఎవరికైనా మీటర్ బద్దలయ్యోలా బాడీ హీటెక్కాల్సిందే. ఈ విషయంలో నోరా కూడా రీసెంట్ గా ఒక సెన్షేషనల్ అండ్ సెక్సీ కామెంట్ చేసింది. తను డాన్స్ చేస్తున్న సమయంలో గనక తన నడుముని అలానే చూస్తే గనక గుర్రం ఎక్కి డాన్స్ చేసినట్టు ఫీలవుతారని హాట్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: