ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ ,స్టార్ హీరోయిన్  సమంత జంటగా నటించిన చిత్రం జాను. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి7న విడుదలకానుంది. దాంతో  ప్రమోషన్స్  ను కూడా స్టార్ట్ చేసింది చిత్ర బృందం. అందులో భాగంగా ఇటీవల సినిమాటీజర్ తోపాటు రెండు పాటలు కూడా విడుదలచేశారు. అయినా కూడా  సినిమా కు పెద్దగా హైప్ రాలేదు.  ఇక ఈ సినిమా ట్రైలర్  ను రేపు సాయంత్రం 5గంటలకు  విడుదలచేయనున్నారు. కోలీవుడ్  సూపర్ హిట్ కల్ట్ మూవీ  '96' కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని  దిల్ రాజు నిర్మిస్తున్నాడు.  ఒరిజినల్ వెర్షన్ ను  డైరెక్టర్ చేసిన ప్రేమ్  కుమారే ఈ రీమేక్ కు దర్శకుడు కాగా  గోవింద్ వసంత  సంగీతం అందిస్తున్నాడు. వీరిద్దరికి తెలుగులో ఇదే మొదటి చిత్రం. మరి జాను కూడా 96ఫలితాన్ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. 
 
ఇక శర్వా  ప్రస్తుతం  శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. రెండురోజుల క్రితం ఈసినిమా ఫస్ట్ లుక్ విడుదలకాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  కిషోర్ రెడ్డి  డైరెక్షన్ లో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా రైతు పాత్రలో కనిపించనున్నాడు.  14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపించంద్ ఆచంట ఈ చిత్రాన్నినిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ లో  శ్రీకారం విడుదలకానుంది. 
 
ఇదిలా ఉంటే సమంత మాత్రం 96 రీమేక్ తరువాత తెలుగు లోనే కాదు  తమిళం లోకూడా  మరో  సినిమాకు   సైన్ చేయలేదు.  అయితే  కొద్దీ  రోజుల క్రితం సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ కు  సీక్వెల్ రానున్న ఫ్యామిలీ మ్యాన్  సీజన్ 2 షూటింగ్ ను పూర్తి చేసింది.  ఇదే ఆమెకు మొదటి వెబ్ సిరీస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: