ఈ సంక్రాంతికి రెండు సినిమాలు పోటీ పడ్డాయి అనేకంటే ఇద్దరు హీరోలు పోటీ పడ్డారనే చెప్పాలి. దసరా నుంచే బన్నీ అల.. ప్రమోషన్ ను పాటల ద్వారా మొదలెట్టేశాడు. జనవరి 12న విడుదల అని కూడా మొదటే ప్రకటించేశాడు. సినిమాలు విడుదలయ్యాక కూడా హిట్ రేంజ్ లో, కలెక్షన్లలో కూడా తానే పైచేయి సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఏకంగా అల.. ను ఇండస్ట్రీ హిట్ చేసుకున్నాడు. ఇక్కడితో ఆగని బన్నీ మహేశ్ పై మరోసారి పైచేయి సాధించే ఆలోచన చేస్తున్నాడని సమాచారం.

 

 

సరిలేరు రిలీజ్ కాగానే మహేశ్ తన ఇంట్లోనే టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ ఇచ్చేశాడు. ఇప్పుడీ విషయంలో కూడా బన్నీ ఏం తగ్గటం లేదని ఇండస్ట్రీ టాక్. మరికొద్ది రోజుల్లోనే బన్నీ అల.. ఇండస్ట్రీ హిట్ కి గుర్తుగా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయబోతున్నాడట. ఈ పార్టీకి ఇండస్ట్రీ నుంచి కొంతమందిని ఆహ్వానించబోతున్నాడట. మీడియాకు కూడా స్పెషల్ పార్టీ అరేంజ్ చేస్తున్నడని అంటున్నారు. ప్రతీది స్పెషల్ గా చూసుకునే బన్నీకి అల.. వైకుంఠపురములో హిట్ ను ఓ తీపి జ్ఞాపకంగా మలుచుకుంటున్నాడని అంటున్నారు.

 

 

మొదటి నుంచీ వీరిద్దరి మధ్యా ఇదే పోటీ నడుస్తోంది. సరిలేరు.. రిలీజ్ కాగానే బ్లాక్ బస్టర్ అని మహేశ్ పోస్టర్ వేస్తే.. బన్నీ ఏకంగా 2020 సంక్రాంతి విన్నర్ అని, మూడో రోజుకి అల.. ను ఇండస్ట్రీ హిట్ గా పోస్టర్లు వేసేశాడు. రోజురోజుకీ కోట్లలో ఫిగర్లు పెంచుకుంటూ పోటీపడి మరీ పోస్టర్లు రిలీజ్ చేశారు. మహేశ్ హన్మకొండలో సక్సెస్ మీట్ పెట్టాడు. బన్నీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి అల..ను ఇండస్ట్రీ హిట్ అని ప్రకటించాడు. ఇలా ప్రతి అంశంలోనూ బన్నీ, మహేశ్ ఒకరిని మించి మరొకరు పోటీపడ్డారనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: