కన్నడ కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన బ్యూటీ రష్మిక మందన్న.. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా హిట్ అవడంతో గీతా గోవిందం ఛాన్స్ అందుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ పీక్స్ లో చేసిన ఈ అమ్మడికి రెండో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ దెబ్బతో తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది రష్మిక. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా రష్మిక నటిస్తుందని తెలుస్తుంది.

 

అంతేకాదు త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కలిసి చేసే ప్రాజెక్ట్ లో కూడా రష్మికని తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం రష్మిక యువ హీరో లవర్ బోయ్ నితిన్ తో జోడీ కడుతుంది. ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న భీష్మ సినిమాలో నితిన్ తో సూపర్ రొమాన్స్ చేస్తుంది రష్మిక. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్ చూసి రష్మిక ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. నితిన్, రష్మిక కంప్లీట్ రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. అయితే రష్మిక ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి రౌడీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

 

తమ హీరోతో ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ చాలా క్లోజ్ గా ఉండే రష్మిక ఇలా మరో హీరోతో ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సినిమా హీరోయిన్ అంటే ఎవరితో అయినా ఎలా అయినా నటించాలి అయినా రౌడీ ఏం ఫీల్ అవుతాడో అన్న యాంగిల్ లో రౌడీ ఫ్యాన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు. రష్మిక మాత్రం భీష్మ సినిమాలో గ్లామర్ లుక్ తో ఆకట్టుకోనుందని తెలుస్తుంది. తెలుగులో ఆమెకు ఉన్న క్రేజ్ కు ఈ రేంజ్ లో రెచ్చిపోతే సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: