రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటి సినిమా పెళ్ళి చూపులు తో ఇండస్ట్రీకి పరిచయమైనా, అతడికి ఎక్కువ పేరు తీసుకొచ్చిన చిత్రం మాత్రం అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో అతడికి దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం విజయ్ గురించి మాట్లాడుతున్నారంటే దానికి కారణం అర్జున్ రెడ్డి సినిమానే. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమా కూడా బ్లాక్ బస్ట అయింది.

 

 


వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్న విజయ్ కి డియర్ కామ్రేడ్ రూపంలో బ్రేక్ పడింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ అంచనాలని అందుకోలేక చతికిల పడింది. దాంతో ఒక్కసారిగా విజయ్ హవా తగ్గిందనే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంతో మన ముందుకి వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

 

 

ఎంత రెస్పాన్స్ వచ్చిందో అన్ని విమర్శలు కూడా వచ్చాయి. మళ్ళీ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలే తీయడం కరెక్ట్ కాదని అన్నవారు ఉన్నారు. అయితే సినిమా ఎలా ఉందనే విషయం తెలియకపోయినప్పటికీ, టీజర్ లో అర్జున్ రెడ్డితో పోలికలు ఉండడంతో అలాంటి కామెంట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా తమిళంలోనూ విడుదల అవుతుందట. ఈ చిత్ర తమిళ టీజర్ ని తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈరోజు రిలీజ్ చేస్తారట.

 

 


విజయ్ తమిళంలో నోటా అనే సినిమా చేశాడు. కాకపోతే అది ఫ్లాప్ అయింది. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోని హీరోయిన్లలో ఒకరైన ఐశ్వర్య రాజేష్ కి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంకా రాశీ ఖన్నా, కేథరిన్ ట్రెసాలు తమిళ సినిమాల్లోనూ నటించారు. వీటన్నింట్ రీత్యా ఈ సినిమాకి తమిళంలోనూ క్రేజ్ ఏర్పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: