నాని హీరోగా ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వి" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నాని ఈ సినిమాకి తన డబ్బింగ్ పార్ట్ ని కూడా పూర్తి చేశాడట. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. సుధీర్ బాబు రక్షకుడిగా కనిపింస్తుండగా, నాని రాక్షసుడిగా కనిపిస్తున్నాడు.

 

 

అంటే ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నట్టు అర్థం అవుతుంది. ఈ లెక్కన చూస్తే సుధీర్ బాబు హీరో అని చెప్పవచ్చు. సుధీర్ బాబు హీరో అయితే నాని విలనా అని అందరి అనుమానం. మిడ్ రేంజ్ లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్న నాని విలన్ గా నటించడం అన్నది అసంభవం. మరి నానిని నెగెటివ్ షేడ్స్ ఉన్నవాడిగా ఎందుకు చూపెడుతున్నారనేది సందేహం.

 

 

అయితే ఇదంతా మేకర్స్ పనే అని తెలుస్తుంది. నాని ని నెగెటివ్ షేడ్స్ లో చూపించి, సినిమాలో మాత్రం పాజిటివ్ గా చూపించనున్నారట. సుధీర్ బాబుని నెగెటివ్ గా చూపించనున్నారట. వీరిద్దరి పాత్రలు ఒకదానికొకటి రివర్స్ లో వేసి చూపించి, సినిమా చూసే ప్రేక్షకులకి థ్రిల్ కలిగించడానికే ఈ విధంగా చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైతేనేం రక్షకుడిగా సుధీర్ బాబు లుక్ కి మంచి రెస్పాన్ వచ్చింది.

 

 

అలాగే నెగెటివ్ షేడ్స్ లో ఉన్న నాని రాక్షసుడు లుక్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. మరి మేకర్స్ ఇచ్చే ట్విస్ట్ కి ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చ్ 25 వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: