టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా రూపొందుతున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. మెగా, నందమూరి హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ఇప్పటికే మూడొంతులు పైగా పూర్తి అయినట్లు ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ప్రకటించింది. ఇక ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విలన్స్ గా నటిస్తున్న హాలీవుడ్ నటులైన స్కాట్, లేడీ స్కాట్ ల ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. అయితే అప్పుడెప్పుడో ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఒక ప్రెస్ మీట్ లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫేస్ లు క్లోజప్ లో ఉన్న ఒక పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప, ఇప్పటివరకు వారిద్దరి లుక్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. అయితే నేడు ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ఇదే అంటూ ఒక పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 

 

పోస్టర్ లో ఎన్టీఆర్ ఎరుపు రంగు చొక్కా, తెల్ల పంచె ధరించి, చేతిలో బాకుతో గుర్రంపై వస్తున్న సీన్ ని గమనించవచ్చు. ఇక ఆ లుక్ అఫీషియల్ గా ఆర్ఆర్ఆర్ నుండి రిలీజ్ చేసింది కానప్పటికీ, సినిమాలో దాదాపుగా ఎన్టీఆర్ లుక్ అలానే ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. కాగా ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతున్న ఆ పోస్టర్ ని చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆనందపడుతున్నారు. కాగా జులై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: