ఒకప్పుడు సినిమా రంగంలో బ్లాక్ బస్టర్ అంటే అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమా అని అంటారు. ప్రతి ఒక్కరు అభిమానించి ఆరదించేవారు.  కానీ, ఇప్పుడు దాని అర్ధం క్రమేణా మారిపోతుంది.  బ్లాక్ బస్టర్ అంటే అందరిని ఆ హీరో తాలూకు సినిమాలు ఆ హీరో అభిమానులను ఆకట్టుకుంటే చాలు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయినట్లే.  పెట్టిన డబ్బులు ఇటీవల కాలంలో తిరిగి వెనక్కి వచ్చి లాభాలు ఇచ్చిన సినిమాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

 

ఈ ఏడాది జనవరి 9 వ తేదీన మొదట రజినీకాంత్ దర్బార్ సినిమా వచ్చింది.  ఈ సినిమా భారీ విజయం సాధించింది.  దాదాపుగా 25 సంవత్సరాల తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడంతో సినిమాకు ప్లస్ అయ్యింది.  ఈ మూవీ భారీ విజయం సొంతం చేసుకోవడంతో రజినీకాంత్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  తమిళనాడులో ఈ సినిమాకు లాభాలు రావడం విశేషం.  


 ఇక, ఇదిలా ఉంటె, ఈ సినిమా రిలీజైన తరువాత వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా ఈ సంక్రాంతికి హిట్ సినిమాగా నిలిచింది.  ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  వరసగా హిట్స్ కొట్టిన మూడో సినిమా ఇది.  మూడు సినిమాలు హిట్ కొట్టడంతో మహేష్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  మూడు సినిమాలు హిట్ కావడంతో నెక్స్ట్ సినిమాపై మహేష్ దృష్టి పెట్టారు.  వరసగా మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలవడం మహేష్ కెరీర్లో ఇదే మొదటిసారి.  


ఇకపోతే, హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కు అల వైకుంఠపురంలో ఆకలి తీర్చింది.  ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది.  సినిమా హిట్ కావడంతో బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  సరైన హిట్ కోసం ఈ సరైనోడు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు.  అభిమానులు కూడా సూపర్ హిట్ సినిమా కోసం ఎదురుచూశారు.  ఇన్నాళ్లకు త్రివిక్రమ్ మరలా బన్నీకి హిట్ ఇచ్చాడు.  అది మాములు హిట్ కాదు.  ఇండస్ట్రీ హిట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: