రాజమౌళి సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  సినిమాపై రాజమౌళికి పూర్తిస్థాయిలో నమ్మకం ఉంటె ఉండొచ్చు.  కానీ, ప్రతి సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా ఎలా తీస్తున్నాడు అన్నది ఇప్పటికి ఎవరికీ అర్ధంగాని విషయం.  రాజమౌళి సినిమాలంటే పడిచచ్చిపోయే వ్యక్తులు కోకొల్లలు.  అయన తీసిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి బాహుబలి సీరీస్ వరకు ఏ సినిమా కూడా ఫెయిల్ కాలేదు.  సినిమాలు వరసగా హిట్ అవుతున్నాయి.

 
రాజమౌళి సినిమా అంటే చాలు ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉంటుంది.  ఓ విధమైన అభిమానం ఉంటుంది.  అందరికి ఆయన ఓ ఆరాధ్యదైవంగా నిలుస్తున్నాడు.  ఇప్పటికే సినిమా రంగంలో ఎనలేని కృషి చేసిన రాజమౌళి ఇప్పుడు అదే స్థాయిలో విజయాలు సొంతం చేసుకుంటూ బిజీ అయ్యాడు.  అసలు రాజమౌళి వరస హిట్ సినిమాలకు కారణాలు ఏంటి.  ఎందుకు అయన సినిమాలు హిట్ అవుతున్నాయి.  తెలుసుకుందాం.  


రాజమౌళి ఒక సినిమా అనుకోని ఆ స్టోరీ సిద్ధం అయ్యాక, స్టోరీ యూనిట్ అందరికి నచ్చిన తరువాత స్క్రిప్ట్ మొదలౌతుంది.  స్క్రిప్ట్, డైలాగులు అన్ని పూర్తి చేసిన తరువాత స్టోరీ బోర్డు వేసుకుంటారు.  ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని అనుకున్నా ఫైనల్ గా స్టోరీ బోర్డు పూర్తయ్యే వరకే.  ఒక్కసారి పూర్తయ్యి, సెట్స్ మీదకు వెళ్తే... సినిమా అలా చేసుకుంటూ వెళ్లడం తప్పించి మార్పులు చేర్పులు ఉండవు.  


పైగా రాజమౌళికి ఒక నిలుస్తాయి ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తాడు.  ఎలా కావాలని కోరుకుంటాడు.  ఏం కావాలని కోరుకుంటాడో అవన్నీ కూడా అయన సినిమాలో ఇవ్వగలుగుతున్నాడు.  నేల టికెట్ ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తాడు కాబట్టే హిట్స్ కొడుతున్నాడు. రిపీట్ ఆడియన్స్ అధికంగా ఉంటారు.  వాళ్ళే సినిమాకు కొండంత అండగా నిలుస్తారు.  వాళ్లే సినిమాకు ప్రాణం పోస్తారు.  అందుకే అయన సినిమాలు హిట్స్ కొడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: