ఈ సంవత్సరం మోస్ట్ ఆంటిసిపేటెడ్ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.  రెండు సంవత్సరాల క్రితం రాజమౌళిసినిమా ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు రోజు రోజుకీ ఆర్.ఆర్.ఆర్ అభిమానులు పెరిగిపోతున్నారు. రాజమౌళి కి ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ సినిమాపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

 

 

1920 ప్రాంతంలో స్వాతంత్ర్యం కోసం పోరాడే వీరుల కథకి కాల్పనికతని జోడించి తీస్తున్న ఈ చిత్రంలో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. కొమరం భీం గా ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ తో పాటు, నిజాం నవాబుకి తిరగబడే సీన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయిట. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి చేసే పోరాటం అద్భుతంగా వచ్చిందని టాక్. అయితే రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్న ఆలియా పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

 

 

ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న చరణ్ కి హీరోయిన్ గా అలియా నటిస్తుందన్న విషయం తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఆలియా పై ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారట. బాహుబలి చిత్రంతో తమన్నా పై వచ్చే ధీవరా.. సాంగ్ మాదిరి ఓ అద్భుత విజువల్ వండర్ గా ఈ పాట ఉంటుందని సమాచారం. కేవలం అలియా మాత్రమే ఈ సాంగ్ నందు నటిస్తారని సమాచారం. 

 

 

ఆలియా ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనకపోవడంతో ఆమె పాత్రపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం బయటకి రావడంతో ఆమెకి ఈ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉందని అర్థం అవుతుంది. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: