కరోనా వైరస్ ప్రపంచానికి పెను ముప్పుగా మారబోతుందా అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు.  చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన ఈ వైరస్ ప్రభావం ఇప్పుడు 17 దేశాలకు విస్తరించింది.  7,711 మందికి ఈ వైరస్ సోకింది.  యుద్ధప్రాతిపదికన చైనా ప్రభుత్వం దీనిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.  170మందికి పైగా మరణించినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.  దీంతో పాటుగా ఇటు ఇండియాలో కూడా ఈ వైరస్ కు సంబంధించిన విషయాలు వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  


కరోనా వైరస్ నుంచి బయటపడటానికి ప్రజలు అనుసరిస్తున్న కొన్ని ఉన్నాయి.  తుమ్ములు వచ్చినపుడు ముక్కుకు గుడ్డ అడ్డుపెట్టుకోవడం ఒకటైతే, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.  జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉంటె తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఈ జబ్బునుంచి బయటపడే అవకాశం ఉంటుంది.  


అయితే, దీనిపై బాలీవుడ్ స్టార్ నటి సన్నీలియోన్ కొన్ని సలహాలు సూచనలు చేసింది.  ఇటీవలే విహారయాత్రకు ముగించుకొని తిరిగి వచ్చిన సన్నీలియోన్ ముంబై ఎయిర్ పోర్ట్ కు వచ్చింది.  ఆమె ముంబై ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే వెంటనే అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు.  అభిమానులు చుట్టుముట్టిన వెంటనే సన్నీలియోన్ వారిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పింది.  


ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ఫీ ముఖ్యం కాదని, సెల్ఫీ ముఖ్యం కాదని, చుట్టూ జరుగుతున్న విషయాలపై అవగాహనా పెంచుకోవడం ముఖ్యం అని చెప్పింది.  వివిధ దేశాల నుంచి వ్యక్తులు ఎయిర్ పోర్ట్ కు వస్తుంటారని, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అవగాహన పొందాల్సిన అవసరం ఉందని చెప్పింది సన్నీ.  సన్నీ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ముంబై ఎయిర్ పోర్ట్ లో మాస్క్ ధరించిన ఆమె ఫోటో వైరల్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: