టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం మరొక హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యద్భుత చిత్ర రాజం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. మరొక హీరో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే మూడేళ్ల క్రితం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్

 

తన ఆకట్టుకునే వాక్చాతుర్యం, క్రేజ్ తో ఆ షోకు మరింతగా రేటింగ్స్ రావడానికి కృషి చేసారు. అనంతరం ప్రసారం అయిన రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని, అలానే మొన్నటి మూడవ సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. అయితే గడిచిన మూడు సీజన్లలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ కె ఎక్కువ శాతం రేటింగ్స్ వచ్చినట్లు చెప్తున్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ ని కల్సిన స్టార్ మా ఛానల్ టీమ్ వారు, మరొక్కసారి అతి త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 4కు ఆయననే హోస్ట్ గా తీసుకుందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్. 

 

జూన్ తరువాత ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అవడంతో ఎన్టీఆర్ కూడా ఫ్రీ అవుతారని, ఆ సమయంలో ఆయన డేట్స్ తీసుకున్నారట. అంతేకాక ఈ తాజా సీజన్ కోసం ఎన్టీఆర్ కు ఊహించని రేంజ్ లో భారీ స్థాయిలో ఆయనకు రెమ్యునరేషన్ కూడా ముట్టజెప్పినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, మరొక్కసారి మనం యంగ్ టైగర్ ని బుల్లితెరపై చూడవచ్చన్నమాట.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: