టాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క పరిధి, రూపు రేఖలు ఒకప్పటితో పోలిస్తే మెల్లగా మరింత గొప్పగా దేశ విదేశాలకు విస్తరిస్తున్నాయి. ఇటీవల రాజమౌళి తీసిన బాహుబలి సినిమాల అత్యద్భుత విజయాల తరువాత దాదాపుగా చాలా సినిమా ఇండస్ట్రీ ల వాళ్ళు మనవైపు చూడడం మొదలెట్టారు. నిజానికి కొన్నేళ్ల నుండి కోలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ సైతం మన సినిమాలను తీసుకుని రీమేక్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అక్కడ కూడా డైరెక్ట్ గా తెరకెక్కి హిట్ సాధిస్తున్న సినిమాలు ఉన్నప్పటికీ, మధ్యలో సల్మాన్, అక్షయ్ కుమార్ వంటి వారు సైతం ఇక్కడి సినిమాలను ఇటీవల అక్కడ తీసి హిట్ అందుకున్నారు. ఆ విధంగా కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన టాలీవుడ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయిన పోకిరి సినిమాని అక్కడ వాంటెడ్ పేరుతో సల్మాన్ రీమేక్ చేసి, 

 

సినిమా సూపర్ హిట్ తో అప్పటివరకూ ఉన్న ఫ్లాప్ ట్రాక్ రికార్డు ని పోగొట్టుకున్నాడు. అక్షయ్ కుమార్ ఇక్కడి విక్రమార్కుడు సినిమాని అక్కడ రౌడీ రాథోడ్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇక కొన్నేళ్ల క్రితం నాగార్జున నటించిన హలో బ్రదర్ అక్కడ జుద్వా పేరుతో తెరకెక్కి హిట్ అందుకుంది. ఇక ఇటీవల వరుణ్ ధావన్ అదే సినిమాకు సీక్వెల్ గా జుద్వా 2 తీసి హిట్ కొట్టాడు. వీటితో పాటు రామ్ నటించిన తెలుగు రెడీ సినిమాని, అక్కా సల్మాన్ అదే పేరుతో తీసి హిట్ కొట్టగా, ఇక్కడి అతడును అక్కడ బాబీ డియోల్ ఏక్ పేరుతో, అలానే ఇక్కడి ఒక్కడు సినిమా అక్కడ తేవర్ పేరుతో అర్జున్ కపూర్ రీమేక్ చేసాడు. ఇక మొన్న విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డిని, 

 

అక్కడ షాహిద్ కపూర్ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ విధంగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని తెలుగు రీమేక్ సినిమాలు అక్కడ తెరకెక్కి మంచి సక్సెస్ లు అందుకున్నాయి. సో, దీనిని బట్టి కొందరు నటులు బాలీవుడ్ లో సరైన కథలు లేక మన తెలుగు సినిమాలపై పడుతున్నారు అనేది మాత్రం ఒప్పుకోవాల్సిన అంశం. అయితే కొన్ని బాలీవుడ్ సినిమాలు సైతం తెలుగులో రీమేక్ అవుతుండగా, ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్న దానితో పోలిస్తే వాటి సంఖ్య తక్కువే అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: