అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే అవుతుంది.  ఆమె సినిమాలు అద్భుతంగా ఉంటాయి.  శ్రీదేవి సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  ఎందుకంటే ఆమె సహజనటి.  చిన్నతనం నుంచి సినిమాల్లో నటిస్తున్నారు.  చాలా సహజసిద్ధమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నారు.  ఎక్కువగా ఆమె తమిళ సినిమాలు చేసింది.  తమిళ సినిమాల్లో ఆమె పాత్ర చాలా సహజసిద్ధంగా ఉంటుంది.  అందుకోసమే ఆమె తమిళ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేది.  


తెలుగులో కూడా దాదాపుగా సహజంగానే నటించింది.  సహజ పాత్రల్లో మెప్పించింది.  అయితే, బాలీవుడ్ విషయానికి వస్తే దానికి పూర్తి విరుద్ధం అని ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పడం విశేషం.  1983లో శ్రీదేవి బాలీవుడ్ తెరకు పరిచయం అయ్యింది.  అక్కడ హిమ్మత్ వాలా సినిమా చేసింది.  జితేంద్ర హీరో.  ఈ సినిమాలో శ్రీదేవిని పూర్తిస్థాయిలో గ్లామర్ గా చూపించారు.  నటించిన మొదటి సినిమానే అక్కడ కమర్షియల్ గా హిట్ కొట్టింది.  దీంతో శ్రీదేవిని కమర్షియల్ సినిమాల్లోనే తీసుకుంటున్నారట.  


ఆ తరువాత కొన్నాళ్ళకు శ్రీదేవి డిగ్లామర్ పాత్రతో కూడిన సద్మ అనే సినిమా చేసింది.  ఈ సినిమా బాలీవుడ్ లో ప్లాప్ అయ్యింది.  అప్పటి నుంచి శ్రీదేవిని గ్లామర్ గా చూపిస్తేనే జనాలు చూస్తారు అనే అవగాహనకు వచ్చింది.  అందుకే అప్పటి నుంచి శ్రీదేవిని అలానే చూపించేందుకు దర్శక నిర్మాతలు కంకణం కట్టుకున్నారట.  నటనకు స్కోప్ ఉండే సినిమాలకంటే గ్లామర్ కు స్కోప్ ఉండే సినిమాలే ఎక్కువగా చేసినట్టు శ్రీదేవి చెప్పింది.  అది తనకు ఓ బ్యాడ్ లక్ అని చెప్పుకొచ్చింది అతిలోక సుందరి.. 


తెలుగులో మాత్రం ఈ సుందరి అన్నిరకాల పాత్రల్లో మెప్పించింది. గ్లామర్ గా మెప్పిస్తూనే అమాయకురాలిగా కనిపించి శభాష్ అనిపించుకుంది.  డి గ్లామర్ పాత్రల్లో కూడా అదరగొట్టింది.  ఇలా బహుముఖ పాత్రల్లో కనిపించిన శ్రీదేవి అందరికి జ్ఞాపకాలను మిగిల్చి అందనంత దూరంగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ హీరోయిన్ గా బాలీవుడ్ లో సత్తా చాటుతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: