హీరో విజయ్ దేవరకొండకి ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో మనొడు విపరీతంగా క్రేజ్ పెంచుకున్నాడు. ఈ ఒక్క సినిమా విజయ్ ని స్టార్ ని చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ "వరల్డ్ ఫేమస్ లవర్" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రేమికుల రోజుల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వత విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే.

 

 

అయితే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొంద "దొరసాని’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. తెలంగాణ ప్రాంతంలో ఒక్కప్పుడు ఉండే దొర పాలనలో కుల సమస్య ఏ విధంగా ఉంటుందో.. డబ్బు, అధికారం ఉన్నవారు సామాన్యులపై చేసే ఆగడాలు ఎలా ఉంటాయో చూపించిన చిత్రమిది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ చాలా చక్కగా నటించాడు. నటన పరంగా ఆనంద్ కి మంచి మార్కులు పడ్డాయి.

 

 

అయితే ఈ సినిమా తర్వాత ఆనంద్ మరో చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు. ఆనంద్ ఎంచుకునే కథలు చాలా విభిన్నంగా ఉంటున్నాయి. తాను పరిచయం అయిన మొదటి చిత్రమే ప్రయోగాత్మక చిత్రాన్ని ఎంచుకున్న ఆనంద్ ఇప్పుడు చేసే రెండవ, మూడవ చిత్రాలని కూడా అదే పంథాలో ఉండేటట్టు చూసుకుంటున్నాడు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ కూర్చోకుండా కథకు ప్రాథాన్యమున్న సినిమాలు చేస్తున్నారు. 

 

 

ఇప్పటికే వినోద్ అనంతోజు డైరెక్షన్లో రెండవ సినిమాను స్టార్ట్ చేసిన ఆయన మూడవ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశారు. తన మూడవ చిత్రంలో  ఆనంద్ ఒక స్కూల్ టీచర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందొక కంప్లీట్ ఎంటెర్టైనర్. తన పాత్రలోనే బోలెడంత ఫన్ ఉంటుందట. కుటుంబానికి, పెళ్లికి మధ్యన నలిగిపోయే స్కూల్ టీచర్ పాత్రట. ఈ పాత్ర చాలా నవ్వులు పండిస్తుందట. మరి అన్న వెళ్తున్న దారిలో కాకుండా తన కంటూ వినూత్నమైన దారిని ఎంచుకోవడం మంచి పరిణామమే

మరింత సమాచారం తెలుసుకోండి: