ప్రదీప్‌ మాచిరాజు రేడియో జాకీగా వచ్చి బుల్లితెర కింగ్‌లా మారిపోయాడు.. ఇప్పటి వరకు ఒక టీవీ వాఖ్యాతగా సక్సెస్ ఫుల్ అయినా ప్రదీప్. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా తన నటన కౌశల్యాన్ని ప్రదర్శించాడు కూడా.. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన ఈ అమలాపురం అబ్బాయి, ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి..

 

 

ఇదే కాకుండా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు  తెచ్చుకుని, బుల్లితెరపై తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఒక రెంజ్‌కు వచ్చాక, అంతా సెటిల్ అయ్యింది అనుకున్నప్పుడు తనలోని కోరికలు తీర్చుకోవడం మొదలు పెడతారు కొందరు. ఈ బాటలోనే ప్రదీప్ నడుస్తున్నాడు.

 

 

అదేమంటే తనను తాను హీరోగా చూసుకోవాలని ఎప్పటి నుండో కలలు కన్నాడు కావచ్చూ. ఆ కోరికను నెరవేర్చు కోవడానికి ఇప్పుడు హీరోగా వెండితెరపైకి రాబోతున్నాడు. అయితే ఇది ఎంతవరకు విజయాన్ని అందిస్తుందనేది మాత్రం తెలియదు. ఇటీవల యాంక‌ర్ ర‌వి కూడా హీరోగా ప్ర‌య‌త్నించి.. మ‌ళ్లీ టీవీ షోల‌తో బిజీ అయిపోయాడు. ఇదిలా ఉండగా మున్నా దర్శకత్వంలో, ప్రదీప్ హీరోగా, 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే చిత్రం వస్తుంది. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజై మంచి  రెస్పాన్స్ తెచ్చుకుంది.

 

 

ఇప్పుడున్న పాతపచ్చడి లాంటి కధలతో కాకుండా 1947లో జరిగే పీరియాడిక‌ల్ స్టోరీని డిఫరెంట్‌గా మలచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాలో ప్రదీప్ మాచిరాజు లవ్ గురుగా నటిస్తున్నాడు.. అయితే ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రానాతో లాంఛ్ చేయించగా, తాజాగా ఈ చిత్రంలోని నీలినీలి ఆకాశం అనే పాటను మహేష్ బాబు చేతుల మీదుగా జనవరి 31న విడుదల చేయిస్తున్నారు. మరి ఈ మహర్షి చేయిపడిన ఈ సినిమా మాచిరాజుకు మంచి రోజులను తెస్తుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగవలసిందేనట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: